చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, మేకపాటి
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో టీడీపీ కార్యాలయంలో సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, అధికార వైసీపీ మునిగిపోయే నావ అని.. అందులో ఎవరూ ఉండరని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ-జనసేనను గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
వైసీపీలో చేరిన టీడీపీ నేత

ఏపీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేత ఆర్వీ సుభాష్ చంద్రబోష్ ఆ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఆర్వీ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఈర్‌జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ పాల్గొన్నారు. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి ఆర్బీ షుభాష్ చంద్రబోస్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.












Click it and Unblock the Notifications