టీడీపీని అక్కడే దెబ్బ కొట్టాలి - వైసీపీలో కొత్తగా వారికి బాధ్యతలు..!!

వచ్చే ఎన్నికల దిశగా వైసీపీ వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రధాన ప్రత్యర్ధి టీడీపీపైన సోషల్ వార్ కు రంగం సిద్దం చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంలో.. పాదయాత్ర ..రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీలు.. సోషల్ మీడియా ప్రచారం బాగా కలిసి వచ్చింది. ఇక, ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వైసీపీని లక్ష్యంగా చేసుకొని రాకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. దీంతో..ఇప్పుడు వైసీపీ పార్టీ కోసం పని చేసే సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించింది.

ప్రతీ గ్రామంలో సోషల్ మీడియా సైనికుడు

ప్రతీ గ్రామంలో సోషల్ మీడియా సైనికుడు

ప్రతీ గ్రామంలోనై పార్టీకి సోషల్ మీడియా సైన్యం ఉండేలా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా.. 26 జిల్లాలకు 132 మంది సోషల్ మీడియా సమన్వయకర్తలను ప్రకటించింది. ఒక్కో జిల్లాలకు ఒక సమన్వయకర్త.. నలుగురు కో సమన్వయకర్తలను ఖరారు చేసింది. ప్రతీ నియోజకవర్గం నుంచి ప్రతీ గ్రామంలోనూ వైసీపీ సోషల్ మీడియాకు ప్రాతినిధ్యం ఉండేలా నియామకాలు చేపట్టింది. వీరికి శిక్షణ..పార్టీ కోసం ఏ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి.. ప్రభుత్వ పథకాలకు.. పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి..ప్రత్యర్ధి పార్టీల ప్రచారం ఎలా తిప్పి కొట్టాలనే అంశం పైన వివరించారు. గ్రామ స్థాయిలో నియామకాలు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే..పథకాలు ఉండవు

టీడీపీ అధికారంలోకి వస్తే..పథకాలు ఉండవు

ప్రధానంగా టీడీపీ హయాంలో ఏ రకంగా ఇచ్చిన హామీలు విస్మరించారు..వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాల పైన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రచారం కొనసాగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీంతో పాటుగా టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేస్తామంటోందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్దేశించినట్లుగా తెలుస్తోంది. ధీంతో పాటుగా ప్రభుత్వం పైన ప్రతిపక్ష నేతలు.. ప్రతిపక్ష సోషల్ మీడియా నుంచి వచ్చే విమర్శలు..ఆరోపణల కు సమాధానం ఇచ్చే విధంగా ప్రతీ స్థాయిలోనూ ప్రభుత్వ సమాచారం సోషల్ మీడియా కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతున్నారు.

ప్రతిపక్షాల ప్రచారం తిప్పికొడుతూ.. సోషల్ వార్

ప్రతిపక్షాల ప్రచారం తిప్పికొడుతూ.. సోషల్ వార్

ఇదే సమయంలో కోర్టులు..రాజ్యాంగ సంస్థల విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు.. టీడీపీ - వైసీపీ రెండు పార్టీలు సోషల్ మీడియా కేంద్రంగానే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం పైన ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు.. ప్రచారాన్ని ఇక నుంచి సోషల్ మీడియా కేంద్రంగా తిప్పి కొట్టేందుకు వైసీపీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ప్రతీ స్థాయిలోనూ అన్ని వర్గాల ప్రజలకు సోషల్ మీడియా చేరువ కావటంతో.. మరింత సమర్ధవంతంగా టీడీపీని సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం ద్వారా.. రాజకీయంగా పై చేయి సాధించే ప్రయత్నాలు కొనసాగతున్నాయి. దీంతో..రానున్న రోజుల్లో వైసీపీ వర్సస్ టీడీపీ సోషల్ వార్ పతాక స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+