ఇన్ని పాపిష్టి పనులు చేస్తే..! పులివెందుల డీఎస్పీకి అవినాష్ రెడ్డి వార్నింగ్..

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందుల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల పర్వంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోలీసుల కాల్పుల ఘటనతో పులివెందుల ప్రాంతంలో నరాలు తెగే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దుండగులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. చెన్నారెడ్డి కాలనీలోని 30వ వార్డులో వైసీపీ అభ్యర్థి నిరంజన్‌రెడ్డి ఇళ్ల వద్ద ఉన్న రెండు లారీలకు దుండగులు నిప్పుపెట్టగా, మరో కౌన్సిలర్ అభ్యర్థి అంజనప్ప ఇంటి వద్ద బైక్‌ను దగ్ధం చేశారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండటంతోనే అధికార పార్టీ అటవీయ రాజ్యానికి తెరలేపిందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు.

పులివెందులలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, పోలీసుల ఏకపక్ష ధోరణిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌కు ఫోన్ చేసి తన ఆగ్రహాన్ని తారాస్థాయిలో వెళ్లగక్కారు. పులివెందులలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని, పులివెందుల అంతా వరస్ట్ పోలీసింగ్ ఈ దేశంలో ఏ నియోజకవర్గంలో లేదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నేతలు వాహనాల్లో రాళ్లు, కర్రలు, రాడ్లు పెట్టుకుని ఇష్టానుసారంగా తిరుగుతూ దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

YSRCP MP Avinash Reddy Fires At Pulivendula DSP Over Nominations Violence And Truck Arson
పులివెందులలో భారీగా దాడులు: టియర్ గ్యాస్ ప్రయోగం
పులివెందులలో భారీగా దాడులు: టియర్ గ్యాస్ ప్రయోగం

"ప్రభుత్వం జీతమిస్తోంది ప్రజలు, టీడీపీ కాదు".. తీవ్ర హెచ్చరిక

డీఎస్పీ తీరుపై విరుచుకుపడిన ఎంపీ అవినాష్ రెడ్డి.. పోలీసు అధికారులది అధికార పార్టీకి తొత్తుగా మారే నైజం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మీకు జీతం ఇస్తుంది ప్రజలు, అంతేతప్ప తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు అంతకంటే కాదు.. బీటెక్ రవి అసలే కాదు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నప్పుడు కాస్తయినా కృతజ్ఞత ఉండాలి" అని హితవు పలికారు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఇలాంటి పాపిష్టి పనులు చేస్తే ఎవరికి మంచి జరుగుతుందని ప్రశ్నించారు. ఒక్క వారం రోజులైనా నిజాయితీగా డ్యూటీ చేయాలని సూచించారు.

"పులివెందులలో ఇంత హింస జరుగుతుంటే ఎందుకు చూస్తా ఊరుకుంటున్నారు మీరు? కేసు కట్టి ఏం చేశారు? ఏం చేసుకోవాలి ఆ కేసు? కేసు కడితే అయిపోతుందా.. అరెస్ట్ చేయారా? భయం పెట్టరా? మా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులను అరెస్టులు చేస్తారు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు?" అని నిలదీశారు

జగన్ పులివెందుల పర్యటన రద్దు, ఇక నేరుగా- కీలక పరిణామాలు..!!
జగన్ పులివెందుల పర్యటన రద్దు, ఇక నేరుగా- కీలక పరిణామాలు..!!

సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా చర్యలేంటి?.. లీగల్ పోరాటం తప్పదు!

దాడులకు సంబంధించిన స్పష్టమైన సీసీటీవీ ఫుటేజ్ అందజేసినప్పటికీ పోలీసులు దోషులను అరెస్ట్ చేయకుండా మౌనంగా ఉన్నారని అవినాష్ రెడ్డి దుయ్యబట్టారు. తాము నామినేషన్లు వేయడానికి వెళ్తే మాత్రం పోలీసులు కాల్పులు జరుపుతారని, అదే టీడీపీ వాళ్లు ఆస్తులు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. వైసీపీ అభ్యర్థులపై దాడులు చేయిస్తూ, మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసి అభ్యర్థులపైనే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదంతా ఎవరికోసం చేస్తున్నారని నిలదీసిన ఆయన, ప్రతి పరిణామానికి లెక్క ఉంటుందని, చట్టపరంగా లీగల్ ఫైట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ అక్రమాలకు పాల్పడే అధికారులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+