వీడియో: లోక్‌సభలో గోరంట్ల మాధవ్ సాహసం: ఆగంతకుడి చేతులు వెనక్కి విరిచికట్టి
న్యూఢిల్లీ/అమరావతి: లోక్‌సభలో చోటు చేసుకున్న ఉదంతం.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప సింహ పాస్ ద్వారా లోనికి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు.. గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ కొనసాగుతున్న సమయంలో పొగబాంబులను విసిరారు.
అనంతరం పారిపోవడానికి ప్రయత్నిొంచిన వారిని సభ్యులు పట్టుకున్నారు. చితగ్గొట్టి.. భద్రత సిబ్బందికి అప్పగించారు. 2003లో సరిగ్గా ఇదే డిసెంబర్ 13వ తేదీన లోక్‌సభపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా 20 సంవత్సరాల తరువాత అదే రోజున ఈ ఘటన సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గ్యాలరీ నుంచి దుండగులు లోక్‌సభలో దూకిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు గోరంట్ల మాధవ్ అక్కడే ఉన్నారు. కిందికి దూకిన వెంటనే వారిని పట్టుకుని కొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వెలువడింది. లోక్‌సభ కుర్చీల మీదికి ఎక్కి ఆ దండుగులను గోరంట్ల మాధవ్ చేరుకోవడం ఇందులో స్పష్టంగా రికార్డయింది.
ఈ ఉదంతంపై గోరంట్ల మాధవ్ స్పందించారు. వారు కిందికి దూకిన వెంటనే తాను పట్టుకోవడానికి ప్రయత్నించానని, అప్పటికే ఇద్దరు సభ్యులు వారిని పట్టుకున్నారని వివరించారు. వాళ్ల చేతులు వెనక్కి విరిచి కట్టి పట్టుకున్నానని చెప్పారు. అనంతరం వారిని భద్రత సిబ్బందికి అప్పగించామని అన్నారు.
లోక్‌సభలో గోరంట్ల మాధవ్ సాహసం: ఆగంతకుడి చేతులు వెనక్కి విరిచికట్టి..!#GorantlaMadhav #LokSabha #loksabha2024 #Parliament #ParliamentWinterSession #ParliamentofIndia #SecurityBreach #ParliamentAttack #Oneindiatelugu pic.twitter.com/1dSq6CGj58
— oneindiatelugu (@oneindiatelugu) December 13, 2023
కిందికి దూకిన వెంటనే ఆగంతకులు స్మోక్ బాంబును విసిరారని, దీనివల్ల సభలో విపరీతంగా పొగ వెలువడిందని అన్నారు. బెల్ట్ బాంబ్ చుట్టుకుని ఉండొచ్చనే అనుమానం తనకు కలిగిందని గోరంట్ల మాధవ్ చెప్పారు. చేతులు విరిచికట్టిన వెంటనే వాళ్లను చెక్ చేశానని బెల్ట్ బాంబుల వంటివి వారివద్ద లేవని వివరించారు.

మానవ బాంబులే అయినప్పటికీ.. వారి పథకాన్ని, కుట్రను ధ్వంసం చేసేలా సభ్యులు ధైర్యంగా నిలిచారని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. కొందరు సభ్యులు భయాందోళనలకు గురైనప్పటికీ తనతో పాటు మరికొందరు ధైర్యంగా వారిని పట్టుకున్నారని, గతంలో తాను సీఐగా పని చేసిన అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని వ్యాఖ్యానించారు. తమ ధన, మాన, ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఒక పోలీస్ అధికారిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications