డీఐజీ సహా ఆ పోలీసు అధికారులను తప్పించండి- కేంద్రానికి వైసీపీ ఫిర్యాదు..!!
స్థానిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఫిర్యాదుతో సుప్రీం కోర్టు చేసిన సూచనల మేరకు ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేసింది. ఈ మేరకు కొత్త తేదీలను ప్రకటించింది. అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలు మారే ఛాన్స్ కనిపిస్తోంది. కాగా.. నామినేషన్ల వేళ కొందరు పోలీసు అధికారుల తీరు పైన వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీఐజీ సహా పలువురు ఐపీఎస్, పోలీసు అధికారుల పైన ఫిర్యాదు చేసింది. కేంద్రంతో పాటుగా రాష్ట్రపతి, సీజేఐ, ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదులు అందించింది.
స్థానిక ఎన్నికల వేళ కొందరు పోలీసు అధికారుల తీరు పైన వైసీపీ సీరియస్ గా ఉంది. అధికార పార్టీకి మద్దతుగా తమను ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం జగన్ సహా పలువురు వైసీపీ నేతలు కొందరు అధికారుల పైన ఆరోపణలు చేసారు. కాగా.. తాజాగా డీఐజీతో పాటుగా ముగ్గురు ఐపీఎస్ లు, పలువురు అధికారుల పై నేరుగా కేంద్రానికి.. రాష్ట్రపతికి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేసారు. చోటు చేసుకున్న పరిణామాల పైన వివరంగా లేఖ రాసారు. అందులో డీఐజీ కోయ ప్రవీణ్ తో పాటుగా అన్నమయ్య, కడప జిల్లాల ఎస్పీ తీరు పైన ఫిర్యాదు లేఖలో వివరించారు. రాష్ట్రపతి, హోం శాఖ కార్యదర్శి, ఎన్నికల సంఘం, ప్రధాన న్యాయమూర్తి , డీఓపీటీ, గవర్నర్ కి ఈ లేఖలు పంపారు. 2019 ఎన్నికల సమయంలో కోయ ప్రవీణ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించిన విషయాన్ని గురుమూర్తి తన లేఖలో గుర్తు చేసారు.

గురుమూర్తి లేఖలో కీలక అంశాలు
అదే విధంగా నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న ఘటనల గురించి వివరించారు. ఎంపీ మిథున్ రెడ్డి పైన దాడి చేయటంతో పాటుగా వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డు కొన్నారని పేర్కొన్నారు. పుంగనూరు నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని గురుమూర్తి వివరించారు. కడప జిల్లాల్లోని పలు మున్సిపాల్టీల్లో నామినేషన్లు దాఖలు చేయనీకుండా వైసీపీ అభ్యర్ధుల పైన దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఎంపీ మిధున్ రెడ్డి పైన కోయ ప్రవీణ్ అవమానించేలా వ్యాఖ్యలు చేసారని పేర్కొన్నారు. పోలీసుల పక్షపాతం పైన విచారణ చేయాలని.. వీడియో ఫుటేజ్ తో పాటుగా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలన చేయాలని కోరారు. నామినేషన్లు వేసేందుకు వస్తున్న అభ్యర్ధులకు రక్షణ కల్పించాలని గురుమూర్తి లేఖలో కేంద్రం, రాష్ట్రపతిని అభ్యర్ధించారు.












Click it and Unblock the Notifications
