రఘురామపై వేటుపై వైసీపీ క్లారిటీ-స్పీకర్ నోటీసుల తర్వాత తొలిసారి- ఎప్పుడో తెలుసా ?

వైఎస్సార్సీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే యుద్ధం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడుతుందా లేదా అంటూ సాగుతున్న ఊహాగానాలకు ఆ పార్టీ ఇవాళ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా త్వరలో రఘురామపై అనర్హత వేటు తప్పదని ఆ పార్టీ ఎంపీ, లోక్ సభలో పార్టీ విప్ మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రఘురామ స్పందనపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ వైసీపీ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

 రఘురామపై అనర్హత వేటు

రఘురామపై అనర్హత వేటు

వైసీపీ తరఫున గెలిచి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నిత్యం వ్యాఖ్యలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు పలుమార్లు ఫిర్యాదులు చేసింది. పార్టీ విధానాల్ని ఉల్లంఘిస్తూ రఘురామ చేసిన వ్యాఖ్యలు, ఆయన వైఖరిపై తగు ఆధారాలను కూడా లోక్ సభ స్పీకర్ కు సమర్పించింది. అయినా చర్యలు లేకపోవడంతో తాజాగా ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా స్పీకర్ పై ఒత్తిడి పెంచింది. చివరికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరుతూ రఘురామరాజుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా సూచించారు.

 రఘురామ స్పందనపై సస్పెన్స్

రఘురామ స్పందనపై సస్పెన్స్

వైసీపీ ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందన తెలియజేసేందుకు రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ ఇచ్చిన 15 రోజుల గడువు గత నెల 30నే ముగిసిపోయింది. దీంతో రఘురామరాజు సమాధానం ఇచ్చారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు రఘురామరాజు కానీ, ఇటు వైసీపీ కానీ ఇప్పటివరకూ దీనిపై స్పందించలేదు. లోక్ సభ స్పీకర్ కార్యాలయం సైతం రఘురామరాజు నుంచి వివరణ వచ్చిందో లేదో వెల్లడించలేదు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ సస్పెన్స్ కు తెరపడే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో వైసీపీ నుంచి తొలి స్పందన వచ్చింది.

 రఘురామపై వేటు ఖాయం

రఘురామపై వేటు ఖాయం

వైసీపీ తరఫున గెలిచి పార్టీ విధానాల్ని నిత్యం వ్యతిరేకిస్తున్న రఘురామకృష్ణంరాజుపై త్వరలో అనర్హత వేటు పడటం ఖాయమని ఆ పార్టీ ఎప్పటినుంచో చెబుతోంది. కానీ వైసీపీ అనుకున్నంత సులువుగా ఈ వేటు పడేలా కనిపించడం లేదు. దీంతో తాజాగా రఘురామకు నోటీసులు జారీ అయిన తర్వాత వైసీపీ స్పందన ఎలా ఉంటుందో తెలియక సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ఆ పార్టీ ఎంపీ, లోక్ సభలో పార్టీ విప్ కూడా అయిన మార్గాని భరత్ మరోసారి స్పందించారు. రఘురామరాజుపై త్వరలో వేటు పడటం ఖాయమని తేల్చిచెప్పారు.

Recommended Video

    CM Jagan VS Raghurama Krishnam Raju | Oneindia Telugu
     స్పీకర్ పరిశీలనలో రఘురామపై వేటు

    స్పీకర్ పరిశీలనలో రఘురామపై వేటు

    లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన నోటీసులకు రఘురామరాజు సమాధానం ఇచ్చారో లేదో తెలియక సస్పెన్స్ కొనసాగుతున్న వేళ తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్.. క్లారిటీ ఇఛ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం స్పీకర్ పరిశీలనలో ఉందని, త్వరలో రఘురామపై వేటు పడటం ఖాయమని ఇవాళ తిరుమల వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దీంతో రఘురామరాజుపై వేటుపై వైసీపీ లో ఏమాత్రం ధీమా సడలడం లేదని తేలిపోయింది. స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత వెలువడిన వైసీపీ నుంచి వెలువడిన తొలి స్పందన కావడంతో ఢిల్లీ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న వైసీపీ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+