వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఢిల్లీ టూర్ పై వైసీపీ స్ట్రాంగ్ రియాక్షన్-రాష్ట్రం పరువు తీసేందుకేనన్న భరత్

|
Google Oneindia TeluguNews

పట్టాభి వ్యాఖ్యల ఎపిసోడ్ అనంతరం టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులపై కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీలోని ఇతర నేతలతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ బృందం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు కూడా కోరింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ పై వైసీపీ స్పందించింది. రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్.. చంద్రబాబు ఢిల్లీ టూర్ పై మండిపడ్డారు. ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్ చేపట్టారని ఆయన విమర్శించారు. ఏపీ నుంచే దేశం మొత్తానికి గంజాయి వెళుతున్నది ఓపెన్ సీక్రెట్ అని టీడీపీ హయాంలో బాబు కేబినెట్ లో చర్చించలేదా? అని ఆయన ప్రశ్నించారు. స్కూల్ బస్సుల్లో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని మీ కేబినెట్ మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు చెప్పలేదా? అని నిలదీశారు. గంజాయి అక్రమ రవాణాలో "పెద్దల" హస్తం ఉందని మీ కేబినెట్ మంత్రులే చెప్పింది నిజం కాదా..? అని మార్గాని భరత్ చంద్రబాబును ప్రశ్నించారు.

ysrcp mp margani bharat slams chandrababus delhi tour, says to defame state at national capital

డ్రగ్స్ రవాణాపై గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాల మీద ఆరోపణలు చేస్తే.. వాళ్ళు తోలు తీస్తారని బాబు భయం అని మార్గాని భరత్ ఆరోపించారు. హైదరాబాద్ లో మీ బంధువులు డ్రగ్స్ వాడుతున్నది నిజం కాదా బాబూ..? అని భరత్ ప్రశ్నించారు.
ఢిల్లీలో "క్యారే.. బోషడీకే" అని బాబు మాట్లాడారా? అని భరత్ అడిగారు. ప్రధానిని బూతులు తిట్టిన వీడియోలు, అమిత్ షాపై రాళ్ళు వేసిన వీడియోలు రాష్ట్రపతికి చూపించారా బాబూ..? అని ఆయన ఎద్దేవా చేశారు. మీరు మాట్లాడిన బూతులను సమర్థించుకోవడానికే ఢిల్లీ వెళ్ళారా అని చంద్రబాబును భరత్ ప్రశ్నించారు.

పొలిటికల్ టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తున్నది బాబు కాదా అని ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. బాబు టక్కు టమారా విద్యలతో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని ఆయన విమర్శించారు. మీకు అధికారం లేకపోతే రాష్ట్ర పరువును తీస్తారా.. యువతపై నెపం వేస్తారా..? అని ప్రశ్నించారు. బాబు రాజకీయాల్లో ఉన్నందుకు యువత సిగ్గుపడే పరిస్థితి వస్తోందన్నారు.

ysrcp mp margani bharat slams chandrababus delhi tour, says to defame state at national capital

Recommended Video

Bigg Boss Telugu 5: కెప్టెన్ VJ Sunny కి Priya కిస్, Anee కు అందరి ముందే ముద్దులు | Oneindia Telugu

ఎన్నికల్లో గెలవలేనని తెలిసిన బాబు.. ఆర్టికల్ 356 కోరుతున్నట్టున్నాడని భరత్ వెల్లడించారు. రాష్ట్రపతికి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పినందుకు బాబు అండ్ కో ను అరెస్టు చేసి అండమాన్ దీవులకు పంపాలన్నారు.

English summary
ysrcp mp margani bharat on today slams tdp chief chandrababu and other leaders delhi tour today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X