చంద్రబాబు తప్పులను సరి చేస్తోన్న వైఎస్ జగన్: అందుకే అక్కసు: వైసీపీ ఎంపీ

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలను సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు 600 రోజులను దాటిన నేపథ్యంలో- చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, విమర్శలను నందిగం సురేష్ తిప్పి కొట్టారు. చంద్రబాబు తన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే అమరావతి ఆందోళనలను చేపట్టారంటూ ఆరోపించారు.

మూడు ప్రాంతాల సమానాభివృద్ధి కోసమే..

మూడు ప్రాంతాల సమానాభివృద్ధి కోసమే..


ఈ మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు చేస్తున్న‌ది ఉద్య‌మం కాద‌ని, ఉన్మాద‌మ‌ని విమ‌ర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మూడు ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి చేయాలనే తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయా ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటు చేయాలని సంకల్పించారని పునరుద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, అమరావతికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.

చంద్రబాబు తప్పును సరి చేస్తోన్న వైఎస్ జగన్

చంద్రబాబు తప్పును సరి చేస్తోన్న వైఎస్ జగన్


ఆ తప్పును వైఎస్ జగన్ సరిదిద్దే ప్రయత్నం చేస్తోన్నారని నందిగం సురేష్ అన్నారు. అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో చంద్రబాబు ఎందుకు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారో.. అది ఎవరికోసం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో చివరికి అమరావతిని కూడా అభివృద్ధి చేయలేదని, శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేసినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదని అన్నారు. అమరావతిలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని నందిగం సురేష్ నిల‌దీశారు.

 దళితుల అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు బాబూ

దళితుల అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు బాబూ

దళితులు, వారి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన మండిప‌డ్డారు. రాజకీయాల కోసమే చంద్రబాబు దళితులను అడ్డుపెట్టుకుంటారని ధ్వజమెత్తారు. తన బినామీ ఆస్తులు ర‌క్షించుకోవ‌డానికే చంద్ర‌బాబు అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కార్యక్రమాలను చేస్తున్నార‌ని విమర్శించారు. చంద్ర‌బాబు మాట్లాడిన భాష ఆయ‌న ఉన్మాదానికి పరాకాష్ఠ అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన స్థాయిని మరిచిపోయిన విమర్శలు చేస్తోన్నారనడానికి నిద‌ర్శ‌న‌మని చెప్పారు. ధ‌ర్నాలు, దీక్షలప్పుడే ఆయ‌న వ‌ద్ద జనాలు ఉంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నట్టుగా చంద్రబాబు డ్రామా చేస్తోన్నారని నందిగం సురేష్ విమర్శించారు.

ఇళ్ల పట్టాలు ఇస్తోంటే..

ఇళ్ల పట్టాలు ఇస్తోంటే..


తమ ప్రభుత్వం 53,000 మంది దళితులకు ఇళ్ల పట్టాలను ఇస్తోంటే.. దానికి చంద్రబాబు అడ్డుపడ్డారని అన్నారు. చివరికి క‌ర‌క‌ట్ట రోడ్డును విస్త‌రిస్తుంటే అడ్డుకుంటున్న‌ది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? అని ఆయన నిలదీశారు. అమరావతి ప్రాంతం మురికివాడగా మారుతోందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని అన్నారు. దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రేమ దీన్ని బట్టి చూస్తే అర్ధం అవుతుందని చెప్పారుు. ద‌ళిత ఎంపీ, ఎమ్మెల్యేల‌పై రాజ‌ధాని ప్రాంతంలో దాడి జ‌రిగితే చంద్ర‌బాబు ఒక్క మాటైనా అన్నారా అని ప్ర‌శ్నించారు.

ఇంగ్లీష్ మీడియా చదువుకోవద్దా?

ఇంగ్లీష్ మీడియా చదువుకోవద్దా?

దళితులు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా.. సొంతింట్లో ఉండకూడదా అని సూటిగా ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని, బాబుకు పేదల గురించి మాట్లాడే హక్కే లేదని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించడం ద్వారా గ్రామస్థాయిలో దళితులు, బడుగులు, అణగారిన వర్గాల, పేదల పిల్లలకు ఉన్నత విద్యావంతులను చేయడానికి వైఎస్ జగన్ ప్రయత్నం చేస్తోంటే.. చంద్రబాబు, నారా లోకేష్, అతని వందిమాగధులు అడ్డుకుంటోన్నారని, అలాంటి వారికి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదనివ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+