వైసీపీలో కొనసాగడంపై తేల్చేసిన పిల్లి సుభాష్

Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. రాజీనామా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. వైఎస్ఆర్సీపీ మూల స్తంభాల్లో ఒకరిగా భావించే సాయిరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే వైదొలగడం ఆ పార్టీకి శరాఘాతంలా మారింది. క్యాడర్‌ను దిగ్భ్రాంతిలోకి నెట్టింది.

రాజకీయాల నుంచి తప్పుకుంటోన్నానంటూ సాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కడ్‌ను ఆయన నివాసంలో కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ వెంటనే ఈ రాజీనామా పత్రం ఆమోదం పొందింది. ఈ మేరకు పార్లమెంటరీ బులెటిన్ సైతం వెలువడింది.

YSRCP MP Pilli Subhash Chandra Bose denies reports of resigning from the Party

భవిష్యత్తులో ఏ రాజకీయపార్టీలోను చేరట్లేదని తెలిపారాయన. రాజీనామా నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతంమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లూ లేవనీ తేల్చి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను ఆదరించిన వైఎస్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాననీ వ్యాఖ్యానించారు.

ఆయనతో పాటు వైసీపీకే చెందిన మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆళ్ల అయోధ్యా రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకట్రెండు రోజుల్లో తమ రాజ్యసభ సభ్యత్వానికి, వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమంటూ వార్తలొచ్చాయి.

దీనిపై పిల్లి సుభాష్ స్పందించారు. తాను పొరపాటున కూడా పార్టీ మారబోనని అన్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏ పరిస్థితుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియట్లేదని పేర్కొన్నారు. పార్టీ సభ్యుడిని ఇప్పుడు మళ్లీ రాజ్యసభకు ఎంపిక చేసుకోలేని పరిస్థితి లేదని అన్నారు.

విజయసాయిరెడ్డి అందరికీ మార్గదర్శకంగా ఉన్నారని, రేయింబవళ్లు పని చేశారని పిల్లి సుభాష్ ప్రశంసించారు. అధికారం పోయాక పార్టీ నుంచి వెళ్లటం, రావడం సాధారణమేనని ఆ జాబితాలో సాయిరెడ్డిని చూడలేమని చెప్పారు. తాను ఎన్ని ఒత్తిళ్లు పార్టీ మారబోనని, ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+