వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి రఘురామ లేఖ- జగన్ డిమాండ్లకు మద్దతిస్తూ-ఇద్దరు సీఎంలకు చెక్

|
Google Oneindia TeluguNews

ఏపీ, తెలంగాణ మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదం నానాటికీ ముదురుతోంది. రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ అభ్యంతరాలతో మొదలైన ఈ వార్ కాస్తా విద్యుత్ ఉత్పత్తికి చేరింది. ఆ తర్వాత ప్రాజెక్టుల భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఇరు రాష్ట్రాలూ సొంత బలగాలను మోహరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాయగా.. ఇప్పుడు ఆయన సొంత పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ రఘురామరాజు కూడా కేంద్రానికి మరో లేఖ సంధించారు. ఇందులో ఆయన జగన్ డిమాండ్లకు మద్దతు పలకడం విశేషం.

కేంద్రానికి రఘురామ లేఖాస్త్రం

కేంద్రానికి రఘురామ లేఖాస్త్రం

ఏపీలో వివిధ సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ నిత్యం లేఖలు సంధిస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ-తెలంగాణ మధ్య ముదురుతున్న వాటర్ వార్ పై రఘురామ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు ఈ లేఖ రాశారు. ఇందులో ఏపీ-తెలంగాణ మధ్య వాటర్ వార్ నేపథ్యం, దీన్ని పరిష్కరించకపోతే ఎదురయ్యే సమస్యలు, కేసీఆర్-జగన్ స్నేహం వంటి పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. దీంతో ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

 కేంద్రం జోక్యం కోరిన రఘురామ

కేంద్రం జోక్యం కోరిన రఘురామ

ఏపీ-తెలంగాణ మధ్య నీటి పారుదల ప్రాజెక్టు విషయంలో తలెత్తిన వివాదాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు డిమాండ్ చేసారు. ఇరు రాష్ట్రాలకూ కీలకమైన ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పనిసరని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ వివాదం ఇప్పుడు పరిష్కరించకపోతే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు రాసిన లేఖలో రఘురామరాజు హెచ్చరించారు.

 జగన్ డిమాండ్లకు రఘురామ మద్దతు

జగన్ డిమాండ్లకు రఘురామ మద్దతు


కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇందులో రాయలసీమ లిఫ్ట్ ను తెలంగాణ అడ్డుకుంటున్న తీరును, ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్న తీరును ఆక్షేపించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుని కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇప్పుడు రఘురామరాజు కూడా తన తాజా లేఖలో కేంద్రమంత్రి షెకావత్ కు అవే డిమాండ్లు వినిపించారు. జగన్ కోరుతున్నట్లుగానే కేంద్ర బలగాలతో ప్రాజెక్టుల వద్ద పహారా ఏర్పాటు చేయాలని సూచించారు.

 జగన్, కేసీఆర్ ది మిత్రుల వివాదం

జగన్, కేసీఆర్ ది మిత్రుల వివాదం

కేంద్రమంత్రి షెకావత్ కు రాసిన లేఖలో ఇరువురు సీఎంలు కేసీఆర్, జగన్ పై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు శత్రువుల మధ్య వివాదాన్ని పరిష్కరించవచ్చని, కానీ మిత్రులైన కేసీఆర్, జగన్ మధ్య వివాద పరిష్కారం అంత సులువేమీ కాదన్నారు. ఈ వివాదం ముదిరి భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో కేంద్రమే పెద్దన్నలా వ్యవహరించి మొత్తం వ్యపహారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని రఘురామ కోరారు.

English summary
ysrcp rebel mp raghurama krishnam raju on today wrote a letter to the union minister for jalshakti affairs gajendra shekawat. in his letter raghurama requests to mobilise central forces at disputed reservoirs between ap and telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X