ఎంపీ రఘురామ అనర్హత: -15 రోజుల్లో 3సార్లు అమిత్ షాతో గుసగుస -జగన్ మద్యం ఆదాయానికీ రెబల్ ఎసరు
వైసీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కంట్లో నలుసులా మొదలై, పక్కలో బల్లెంలా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా సంచలన చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. అధినేతపై ఆరోపణలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోన్న రఘురామపై అనర్హత వేటేయాలంటూ వైసీపీ హైకమాండ్ పార్లమెంటు బయటా, లోపలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, ఆ వ్యవహారంపై రెబల్ ఎంపీ అనూహ్య విషయాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు, జగన్ సర్కారు మద్యం పాలసీపై అసాధారణ ఆరోపణలు చేసిన ఆయన.. ఏపీలో అమ్ముడువతోన్న లిక్కల బ్రాడ్లను రద్దు చేయించే దిశగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ ఈ మేరకు పలు విషయాలు చెప్పారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఏపీలో మద్యం బ్రాండ్లపై ఫిర్యాదు..
''ఆంధప్రదేశ్ లో మాత్రమే ప్రత్యేకంగా సాగుతోన్న మద్యం అమ్మకాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి భారతీ పవార్ లను ప్రత్యక్షంగా కలిసి వినతి పత్రాలు ఇచ్చాను. ఏపీలో అమ్ముతోన్న పేరులేని, నాసిరకం బ్రాండ్ల వల్ల మద్యం మరణాలు పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుందని, వాటిపై నజర్ వేయాలని కోరాను. రాష్ట్రంలో అమ్ముతోన్న విచిత్రమైన బ్రాండ్లను ఓ ముగ్గురు వ్యక్తులు మాత్రమే తయారు చేస్తున్నారు...

వైసీపీ అధినేత వర్సెస్ సీఎం
రాష్ట్రంలో మద్యనిషేధం చేయనివాడు బుద్ధిలేనోడని మా పార్టీ అధినేత వైఎస్ జగన్ సెలవిచ్చారు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన స్టాండ్ మార్చుకోవడంతో పార్టీ మనుగడకు ఇబ్బందులు వస్తున్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లలోనే మద్యం అందుబాటులో ఉంటుందని పార్టీ అధినేతగా చెప్పిన జగన్.. ముఖ్యమంత్రిగా మాత్రం విచిత్రమైన బ్రాండ్లను సామాన్యులు అందరికీ అమ్మేస్తున్నారు. అంతేకాదు, మద్యం అమ్మకాలనే ఆదాయంగా చూపుతూ బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు పొందింది జగన్ సర్కారు. మద్యంపై నమ్మకంతోనే దాదాపు రూ.25వేల కోట్లు అప్పులు చేశారు. తద్వారా రాబోయే 20 ఏళ్లలోనూ ఇతరులెవరూ మద్య నిషేధం అమలు చేయడానికి వీల్లేకుండా జగన్ వ్యవహరించారు. నిజానికి..

స్కీములకు మద్యానికి లింకు ఇదే..
ఏపీలో అమలవుతోన్న స్కీములు, మద్యం అమ్మకాలకు స్పష్టమైన సంబధాలున్నాయి. ఉదాహరణకు ఒక బడుగు జీవి.. ఒక మద్యం సీసాను రూ.300కు కొనుక్కుంటే, అందులో రూ.100 తయారీ ఖర్చుపోతే, తయారీ దారులకు మరో రూ.100 లాభం, లైసెన్సులు ఇచ్చిన ప్రభుత్వానికి రూ.100 వెళుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా రూ.23వేల కోట్ల ఆదాయం వస్తోంది. తయారీ దారుడికి కూడా అంతే ఆదాయం వస్తోంది. మరి అంత పెద్ద మొత్తంలో మద్యం ద్వారా ఆదాయం ఎవరికి వెళుతోంది? అనేది కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టడానికి పెద్దగా శోధన అవసరం లేదు. ఆ లబ్దిదారుడు ఎవరో సీఎం జగన్ చాలా ఈజీగానే పట్టేయొచ్చు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు నేస్తం లాంటి పథకాలకు డబ్బుల్ని ఒకేసారి ఇవ్వకుండా విడదల వారీగా ఇస్తున్నారు. ఒకేసారి ఇస్తే లబ్దిదారులు ఏదైనా కొనుక్కోవచ్చు కానీ, నాలుగు దఫాలుగా ఇచ్చే డబ్బు ఒక్క లిక్కర్ కే తప్ప దేనికీ సరిపోవడం లేదు. అకౌంట్లలో డబ్బులు పడిన రోజుల్లో మద్యం ద్వారా ఆదాయం కూడా గణీయంగా పెరుగుతోంది. ఇటు ప్రభుత్వానికే కాకుండా మద్యం తయారీ దారులకూ లాభాలు పోతున్నాయి. మరి వాళ్లెవరో తేల్చాలి..

మందుబాబులను తాకట్టు పెడతారా?
మద్య నిషేధమే విధానంగా ఉన్న వైసీపీ.. ఏపీలో ప్రభుత్వాన్ని నడుపుతూ.. దేశంలోనే మద్యం ద్వారా ఎక్కువ ఆదాయం పొందే రాష్ట్రంగా నిలవడం గమనార్హం. దీని ద్వారా స్కీములకు, లిక్కర్ స్కాముకు కచ్చితంగా సంబంధాలున్నాయి. దీనిపై ప్రజలే స్పందించాలి. సరసమైన ధరలకు మంచి మద్యాన్ని అందించాలని సీఎంకు ప్రజలే లేఖలు రాయాలి. వైసీపీ విధానం ప్రకారం మద్యం తాగొద్దు, కానీ జగన్ ప్రభుత్వం అమ్ముతోన్న మద్యంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు మద్యం ప్రియులు చాలా మంది నాక్కూడా వినతులు పంపుతున్నారు. మందుబాబుల తలలు తాకట్టు పెట్టొద్దని కోరుతున్నాను. ఇక ముఖ్యమైన విషయానికొస్తే..

సన్నాసి సలహాదారుడికి ఎందుకు?
రోజూ మీడియాతో మాట్లాడే ఓ వెధవ గురించి చెప్పుకోవాలి. సాధారణంగా కేంద్ర మంత్రులను కలిసినప్పుడు అక్కడ ఫొటోగ్రాఫర్లు ఉంటే ఫొటోలు తీసి పంపుతారు, వాళ్లు లేని సందర్భాల్లో ఫొటోలు ఉండవు. జగన్ ప్రభుత్వ సలహాదారుడైన ఆ వెధవ దీనిపైనా కారుకూతలు కూశాడు. నేను అమిత్ షాను గతంలోనూ కలిశానని చెప్పుకున్నా ఫొటోలు పెట్టలేదని వెకిలిగా మాట్లాడాడు. అయినా, నేను అమిత్ షాను ఎన్నిసార్లు కలిస్తే ఈ సన్నాసి సలహాదారుడికి ఎందుకు? కేంద్రంలో జగన్ కు బాగా పలుకుపబడి ఉందని చెప్పుకుంటున్నారు కదా, మరీ సన్నాసి వెధవ అక్కడి నుంచి రిపోర్టులు తెప్పించుకోవచ్చు కదా. అసలు..

అనర్హత వేటు.. అమిత్ షా చాటు?
అవును, గడిచిన 15 రోజుల వ్యవధిలో అమిత్ షాను నేను 3సార్లు కలిశాను. ఇవన్నీ నీకెందురా ఇడియట్, ఏపీ ప్రభుత్వం ఇస్తోన్న డబ్బులు తీసుకుని వాడుకోగానీ, ఇష్టమొచ్చినట్లు వాగొద్దురా వంకర వెధవ. నీకు డబ్బులు ఇచ్చేవాడికి నెల రోజులుగా అపాయింట్మెంట్ దొరకట్లేదని, నాకు దొరికితే ఏడుస్తావా? అమిత్ షా దేశానికి హోం మంత్రి. అమరావతి వివాదంతో కేంద్ర హొం శాఖకు సంబంధం ఉంది కాబట్టి దానిపైనే నేను కలిసి ఉండొచ్చు. లేదా ఇంకేదైనా అంశంపై కలిసుండొచ్చు. నాపై అనర్హత ఫిర్యాదుకు సంబంధించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే లేఖ రాశాను. ఇదే విషయమై కేంద్రం పెద్దలను కూడా కలుస్తూ, వాస్తవాలను, ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు చెప్పాల్సిన అంశాలన్నీ వివరించాను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. కాగా, వైసీపీ ఫిర్యాదు మేరకు అనర్హత వేటు అంశంలో సమాధానం చెప్పాల్సిందిగా స్పీకర్ జారీ చేసిన నోటీసులకు సమాధాని ఇచ్చానని చెప్పిన రఘురామ.. అదే విషయమై అమిత్ షాను కలవడం, గడువు తీరిన తర్వాత కూడా స్పీకర్ కార్యాలయం నుంచి మళ్లీ ఎలాంటి ప్రకటన రాకపోవడం కొత్త చర్చకు దారితీసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications