చంద్రబాబు-మోడీ మాట్లాడుకుంది ఇదే-సాయిరెడ్డి ట్వీట్-ఆ మాట నిజమే కానీ..
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో బీజేపీ, ప్రధాని మోడీ ప్రస్తావన అప్పుడప్పుడూ వస్తూనే ఉంది. అయితే ఈసారి నిన్న జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశం సందర్భంగా మోడీ-చంద్రబాబు భేటీ మాత్రం వైసీపీని కలవరపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ భేటీలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ కీలక ట్వీట్ చేశారు.
Recommended Video


చంద్రబాబు-మోడీ సంభాషణ
నిన్న ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ పలువురు విపక్ష నేతలతో మాట్లాడారు. ఇందులో ఏపీ విపక్ష నేత చంద్రబాబు కూడా ఉన్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ప్రధాని మోడీ చంద్రబాబు సహా పలువురు విపక్ష నేతల్ని వ్యక్తిగతంగా కలిసి కాసేపు మాట్లాడారు. అయితే మిగతా నేతలతో పోలిస్తే నాలుగేళ్ల విరామం తర్వాత చంద్రబాబు-మోడీ కలిసి మాట్లాడుకోవడం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై మీడియాలో భిన్న కథనాలు వస్తున్నాయి.

సాయిరెడ్డి కన్ఫర్మేషన్ ఇదే
చంద్రబాబు-మోడీ భేటీలో పూర్తిగా ఏం జరిగిందనే విషయంపై వారిద్దరికీ మినహా మిగతా వారికి పూర్తిగా క్లారిటీ లేకపోయినా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భేటీ సందర్భంగా హాజరైన కొందరు ఈ విషయాల్ని మిగతా వారితో పంచుకున్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ అనుకూల మీడియా కూడా ఢిల్లీకి అప్పుడప్పుడూ వస్తూ ఉండండి అంటూ చంద్రబాబును ప్రధాని మోడీ కోరారంటూ వార్తలు రాసింది. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు-మోడీ భేటీలో ప్రస్తావనకు వచ్చిన ఓ విషయాన్ని మాత్రం నిర్ధారించారు. చంద్రబాబును నిత్యం టార్గెట్ చేసే సాయిరెడ్డి.. ఇవాళ ఓ ట్వీట్ చేస్తూ అందులో ప్రధాని మోడీ చంద్రబాబుతో మిలేంగే అని అన్నారని మాత్రం చెప్పారు. అంటే దానర్ధం మళ్లీ కలుద్దామని.

మోడీ వ్యాఖ్య సారాంశమిదేనట !
చంద్రబాబును ఈ భేటీలో ప్రధాని మోడీ మిలేంగే(మళ్లీ కలుద్దాం) అని చెప్పడాన్ని మాత్రం నిర్దారించిన విజయసాయిరెడ్డి దీనిపై ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో మిలేంగే అని ప్రధాని మోడీ అన్నారో లేదో చంద్రబాబు మళ్లీ పాతరోజులు వచ్చాయని కలలుగంటున్నాడంటూ ట్వీట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు నిమిషం మాట్లాడినా వెళ్లేటప్పుడు మిలేంగే(కలుద్దాం) అనడం సాధారణం అని సాయిరెడ్డి పేర్కొన్నారు. దాని అర్ధం అప్పుడప్పుడు ఢిల్లీకి రండి అని కాదు. ఊహలు గుసగుసలాడే అన్నట్లు కుల మీడియాతో డప్పుకొట్టిస్తున్నాడు అంటూ చంద్రబాబుపై సాయిరెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు.












Click it and Unblock the Notifications