తక్షణం జోక్యం చేసుకోండి..: రాష్ట్రపతికి జగన్, క్విడ్ ప్రోకో అన్న లోకేష్..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ కంటే తామే ముందున్నామని వైసీపీ సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వినతిపత్రం అందజేయడం గమనార్హం. వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

Ys jagan

తమ పార్టీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతిని కలిసి లేఖలు అందించినట్టు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్రానికి హోదా ఇచ్చేలా కేంద్రానికి సూచించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాష్ట్రపతికి సమర్పించిన లేఖ ప్రతిని పోస్టు చేశారు.

జగన్‌ లేఖ మరో క్విడ్‌ప్రోకో: లోకేశ్‌

రాష్ట్రపతికి వైసీపీ అధినేత జగన్‌ లేఖలు రాయించడంతో మరోసారి 'క్విడ్‌ప్రోకో' బయటపడిందని మంత్రి లోకేష్ ఆరోపించారు. తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోదాపై రాష్ట్రపతికి లేఖ రాశారు గానీ.. అందులో ఎక్కడా ప్రధాని గురించి ప్రస్తావించకపోవడం వైసీపీ అసలు రంగును బయటపెట్టిందని అన్నారు. ఒకపక్క సభలో మోడీ కాళ్లు పట్టుకుంటారని, మరోపక్క అదే పార్టీ ఎంపీలు ప్రధానికి వ్యతిరేకంగా మౌనవ్రతం చేపడుతారని, ఇవన్నీ డ్రామాలని కొట్టిపారేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MP's demanded President Ramnath urgent intervention on special status issue. Regarding this they given a letter to president on Tuesday

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X