వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కైకలూరు, ఏలూర్లలో ఎగబడ్డారు: షర్మిల బిజీ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో కైకలూరు, ఏలూరు తదితర ప్రాంతాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కంటే పదవులు ముఖ్యం కాదని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ చెప్పినట్లు ముఖ్యమంత్రి పీఠం కోసం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, పీఠం కాపాడుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డిలు విభజను పావులా వాడుకున్నారని ఆరోపించారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ పైన కుట్రతో కేసులు పెట్టి, సిబిఐని ఉసిగొల్పారని, ధైర్యంలో జగన్‌కు సాటిలేరన్నారు. జగన్ త్వరలో బయటకు వస్తారన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేసే యోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు.

నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలుచింపిన విస్తరి చేసిందని, సంక్షేమ పథకాలు అన్నీ కుంటుపడ్డాయని, చేసిన పాపాలు చాలవన్నట్లుగా రాష్ట్రాన్ని గొడలితో నరికి రెండు ముక్కలు చేసిందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తుంటే, కాంగ్రెస్, టిడిపి నాయకులు చోద్యం చూస్తున్నారని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ లేఖ ఇవ్వలేదన్నారు.

కైకలూరులో

కైకలూరులో

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలోని కైకలూరులో తరలి వచ్చిన సమైక్యవాదులు. ఆమె యాత్రకు ఇక్కడ భారీ స్పందన కనిపించింది.

ఏలూరులో.

ఏలూరులో.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో తరలి వచ్చిన సమైక్యవాదులు. షర్మిలతో చేతి కలిపేందుకు ఎగబడుతున్న అభిమానులు.

జన సందోహం

జన సందోహం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో తరలి వచ్చిన సమైక్యవాదులు. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న షర్మిల. షర్మిల సమైక్య శంఖారావ యాత్రను కొనసాగిస్తున్నారు.

కావూరి ఇంటి వద్ద విశాలాంధ్ర ప్రతినిధులు

కావూరి ఇంటి వద్ద విశాలాంధ్ర ప్రతినిధులు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఇంటి వద్ద రాజీనామా చేయాలంటూ ధర్నా చేస్తున్న విశాలాంద్ర ప్రతినిధులు.

అరెస్టు

అరెస్టు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఇంటి వద్ద రాజీనామా చేయాలంటూ ధర్నా చేసిన విశాలాంధ్ర ప్రతినిధులను అరెస్టు చేసిన పోలీసులు.

అశోక్ బాబు

అశోక్ బాబు

సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఎపిఎన్జీవోలు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు.

English summary
YSR Congress Party leader Sharmila on thursday said YSRCP never gave letter to Centre to divide state, It was TDP chief Nara Chandrababu Naidu who did it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X