టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే - సీమ నుంచి ఆరంభం..!?
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. పార్టీ నేతలకు జగన్ భరోసా ఇస్తున్నారు. తిరిగి ప్రజా మద్దతు ఉంటుందని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు చంద్రబాబు పాలన - పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి తాజాగా గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోని ముఖ్యులతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మార్పు ఖాయమని ప్రచారం సాగుతోంది.
మారుతున్న రాజకీయం
ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాలనా పరంగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలోనూ రాజకీయంగా వైసీపీని ఆత్మరక్షణలోని నెట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లా నుంచి రెండు స్థానాల్లో గెలుపొందింది. అందులో ఆలూరు నుంచి గెలిచిన విరూపాక్ష గురించి ఇక వార్త పెద్ద ఎత్తున ప్రచారంోలకి వచ్చింది. జిల్లాలో 12 స్థానాలతో పాటుగా రెండు ఎంపీ స్థానాలను టీడీపీ గెలుపొందింది. దీంతో, వైసీపీలో ఉండటం ద్వారా తమ పనులు జరగవనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీతో టచ్ లో
దీంతో, కొందరు టీడీపీ ముఖ్యులతో ఆయన టచ్ లోకి వచ్చారనే ప్రచారం సాగుతోంది. టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు.అయితే, ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విరూపాక్షి.. పార్టీ మారే ప్రసక్తే లేదని ఖండించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ..మరోసారి ఎమ్మెల్యే పార్టీ మార్పు వార్తలు మొదలయ్యాయి. ప్రభుత్వం మారటంతో ద్వితీయ శ్రేణి కేడర్ సైతం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీలర్ షిప్‌లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, వివిధ ప్రభుత్వరంగ సంస్థలలో పార్ట్ టైం ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని, వాటిని కాపాడుకునేందుకు పార్టీ మారుదామా కేడర్ ఆలోచనలో పడ్డినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది.
పార్టీ మారుతారా
క్షేత్ర స్థాయిలో ఉన్న రాజకీయ విభేదాలతో టీడీపీ నేతలు అందిరనీ తమ పార్టీలోకి రావటానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్‌లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ప్రభావం కూడా ఆలూరు నియోజకవర్గంపై ఉండటంతో కొందరు వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కేడర్ నుంచి ఎమ్మెల్యే పైన పార్టీ మార్పు పైన ఒత్తిడి పెరుగుతందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే..తాను పార్టీ మారే ఆలోచన లేదని విరూపాక్ష చెబుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..వైసీపీ ఎమ్మెల్యే అడుగుల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications