ఆపేయండి: బాలకృష్ణ, లెజెండ్‌పై జగన్ పార్టీ అభ్యంతరం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన లెజెండ్ సినిమా పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యంతరం చెబుతోంది. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున రానున్న సార్వత్రిక ఎన్నికలలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నందున లెజెండ్ చిత్రాన్ని నిలిపి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఈసిని కలిశారు. బాలయ్య ఎన్నికల బరిలో నిలబడినందున ఆ చిత్రాన్ని నిలిపివేయాలని కోరారు. బాలకృష్ణ టిడిపి తరఫున బరిలో ఉన్నందున సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని వారు చెబుతున్నారు.

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం మాస్‌తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్‌ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రం షోలు ఆపేయండని అనంతపురం కలెక్టరకు వినతి పత్రం అంద చేసిన విషయం తెలిసిందే. జగన్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి, కో ఆర్డినేటర్ ఆదినారాయణ వారం రోజుల క్రితం రాత్రి కలెక్టర్ లోకేషన్ కుమార్‌ని కలిసి వినతిపత్రం అందచేసారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఈసిని కలవనున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications