ఎల్గుండి నుండి గుంటూరులో వైసీపీ ప్లీనరీ, ఇక దూకుడే...
వైసీపీ రెండు రోజుల పాటు నిర్వహించే ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్ల టిడిపి పాలనపై వైసీపీ సమరశంఖం పూరించనుంది. వైసీపీ అధ్యక్ష పదవి ఎన్నికలను కూడ నిర్వహించనున్నారు.
అమరావతి:వైసీపీ రెండు రోజుల పాటు నిర్వహించే ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్ల టిడిపి పాలనపై వైసీపీ సమరశంఖం పూరించనుంది. వైసీపీ అధ్యక్ష పదవి ఎన్నికలను కూడ నిర్వహించనున్నారు. రెండు తెలుగురాష్ట్రాల నుండి సుమారు 300 మంది ప్రతినిధులు ఈ ప్లీనరీకి హజరుకానున్నారు.అయితే అధ్యక్ష ఎన్నికల లాంఛనమే. అయితే భవిష్యత్ ఎన్నికల కోసం ఆ పార్టీ నాయకత్వం ఇక దూకుడుగా వ్యవహరించనుంది.
కడప జిల్లా ఇడుపులపాయలో కాకుండా తొలిసారిగా అమరావతిలో గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
అమరావతి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తోందనే సంకేతాలను ఇచ్చేందుకుగాను ఆ పార్టీ నాయకత్వం ఈ మేరకు గుంటూరు జిల్లాలో ప్లీనరీని నిర్వహిస్తోంది.
2019 ఎన్నికలకు సంబంధించిన వ్యూహరచన కోసం ప్లీనరీని వేదికగా ఉపయోగించుకోనుంది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం ఈ మూడేళ్ళలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకు వ్యూహరచన చేయనుంది.

రెండురోజుల పాటు వైసీపీ ప్లీనరీ
ఈ నెల 8, 9 తేదిల్లో రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలను గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు హజరుకానున్నారు.భవిష్యత్ లో పార్టీ కార్యక్రమాలకు గాను ఈ ప్లీనరీ దిశానిర్ధేశం చేయనుంది. రానున్న రోజుల్లో పార్టీ మరింత దూకుడుగా కార్యక్రమాలను నిర్వహించనుంది. టిడిపి వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుంది. 2019 ఎన్నికల కోసం మరింత దూకుడుతో కార్యక్రమాలను నిర్వహించాలని సీనియర్ల సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం.

వైసీపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు
ఈ నెల 8వ, తేదిన ప్లీనరీ ప్రారంభం కానుంది. అయితే ప్లీనరీ ప్రారంభమైన కొద్దిసేపటికే అథ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 9వ, తేదిన అధ్యక్షుడిని ఎన్నుకొంటారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరిస్తారు. అధ్యక్ష ఎన్నికలకు రిటర్నింగ్ అధికారికగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు. అయితే అధ్యక్ష ఎన్నిక లాంఛనమే కానుంది. అధ్యక్షుడిగా జగన్ మరోసారి ఎన్నిక కానున్నారు. ఈ ఎన్నిక లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్లీనరీ ప్రారంభానికి ముందుగానే పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ముసాయిదా తీర్మాణాలకు ఆమోదముద్ర వేస్తారు. ఆ తర్వాత ప్లీనరీలో సాధారణ ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది.

టిడిపి వైఫల్యాలపై పోరాటం
అధికారం చేపట్టిన నాటి నుండి టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను తీర్మాణ రూపంలో వైసీపీ ప్రస్తావించనుంది. టిడిపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకుగాను ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలు, ఎన్ని హమీలను నెరవేర్చారు. నెరవేర్చని హమీలేమిటి. అమలులో ఉన్న లోపాలు తదితర అంశాలపై చర్చించి వాటిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

ప్లీనరీ కోసం ఏర్పాట్లు
వైసీపీ ప్లీనరీ వేదికపై 300 కూర్చొనేలా వేదికను ఏర్పాటుచేశారు. 80 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు ఆరడుగుల ఎత్తులో వేదికను ఏర్పాటుచేశారు. వేదికకు ఎడమవైపున జగన్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటుచేశారు. ప్లీనరీ కోసం వచ్చే ప్రతినిధులకు 500 మీటరల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. భోజనం చేసేందుకు ప్రత్యేకంగా డైనింగ్ హల్ ను ఏర్పాటుచేశారు. ప్రాంగంణంలో ఆరు పెద్ద ఎల్ ఈ డీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications