పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ.. వైఎస్ జగన్ భావోద్వేగం
అధికార వైఎస్ఆర్సీపీ ఇవ్వాళ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. క్యాడర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వాళ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది. పార్టీ ఏర్పాటైన ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో ఏపీలో అధికారంలోకి తీసుకుని వచ్చారు వైఎస్ జగన్. 2014 నాటి ఎన్నికల్లో ప్రతిపక్షంగా.. ఆ తరువాతి ఎన్నికల్లో 151 మంది శాసన సభ్యుల బలంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 22 మంది లోక్ సభ సభ్యులతో దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకొంటోన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అటు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- పార్టీ క్యాడర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 12 వసంతాలు పూర్తి చేసుకుని, ఇవ్వాళ 13వ వసంతంలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు. ఈ శుభ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని అన్నారు.

12 సంవత్సరాల ఈ ప్రయాణంలో తనతో నిలిచి, వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నట్లు భావోద్వేగంతో ట్వీట్ చేశారాయన. పార్టీ ఆవిర్భావానికి కారణమైన సందర్భాన్ని వివరిస్తూ గతంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను జగన్ తన ట్వీట్ కు జత చేశారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications