టార్గెట్ చంద్రబాబు.. మేమూ: పవన్ కళ్యాణ్‌తో కలిసేందుకు జగన్ సిద్ధం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే, ప్రత్యేక హోదా కోసం జగన్‌తో కలిసేందుకు సిద్ధమని పవన్ ప్రకటించారు.

తాజాగా, వైసిపి నేత విజయ సాయి రెడ్డి జనసేన అధినేతకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. తాము కూడా పవన్‌తో జత కట్టేందుకు సై అన్నారు.

తద్వారా, నారా చంద్రబాబు నాయుడిను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా, 2019లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై జగన్ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడం గమనార్హం.

YS Jagan - Pawan Kalyan

చంద్రబాబును అడ్డుకునేందుకు జనసేన సహా, సీపీఐ, సీపీఎం తదితర భావ సారూప్యమున్న పార్టీలతో పొత్తుకు సిద్ధమని ఆ పార్టీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన క్రమంలో తమతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామన్నారు.

హోదా కోసం వారితో కలసి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎన్నడూ విశ్వసించే అవకాశం లేదని, అటువంటి ద్రోహం చేసిన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకోబోమన్నారు.

బీజేపీతో సంబంధాలకు తాము సిద్ధంగా లేమని, పెట్టుకోవాలంటే గతంలోనే ఆఫర్ వచ్చిందన్నారు. హోదా కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ తమతో చేతులు కలిపితే సంతోషమన్నారు. తమ పోరాటాన్ని సమర్థించేవారిని ఎప్పుడైనా స్వాగతిస్తామని, వారితో కలసి పోరాటం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+