బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట..!!

అమరావతి: ఏపీలో శాసన మండలి (MLC elections in AP) ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మరో ఓటమిని చవి చూసింది. పట్టభద్ర నియోజకవర్గాల్లో ఎదురైన ఫలితాలే ఇక్కడా కనిపించాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీచింది. సాంకేతికపరంగా తెలుగుదేశం పార్టీకి బలం లేనప్పటికీ- తన అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టమైంది.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పంచుమర్తి అనురాధ- ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఫలితంగా క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్న వైఎస్ఆర్సీపీ ఆరు స్థానాలను గెలుచుకోగలిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకే ఓటు వేసినా- అదే పార్టీకి చెందిన శాసన సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు స్పష్టమైంది. మొత్తంగా నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం వల్లే టీడీపీ గెలిచింది.

వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన నెల్లూరు రూరల్, వెంకటగిరి శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కాకుండా మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. మొత్తంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారు. ఫలితంగా- పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మర్రి రాజశేఖర్- 22, సూర్యనారాయణ రాజు- 22, జయమంగళ వెంకట రమణ- 21, కోలా గురువులు- 21, బొమ్మి ఇజ్రాయిల్- 22, పోతుల సునీత 22, ఏసురత్నం- 22 ఓట్లు పోల్ అయ్యాయి.

YSRCPs Rebel MP Raghu Rama Krishnam Raju reacts over Partys defeat in MLC elections in AP

టీడీపీ నుంచి పోటీ చేసిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు పడ్డాయి. కోలా గురువులుతో పాటు తక్కువ ఓట్లను సాధించినప్పటికీ- ప్రాధాన్యత క్రమాన్ని బట్టి జయమంగళ వెంకటరమణను ఓడిపోయినట్లు ప్రకటించారు అధికారులు. పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు తాజాగా ఎదురైన ఓటమి- రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిణామాలను సృష్టించినట్టే కనిపిస్తోంది.

ఈ ఎన్నిక ఫలితాలపై వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుగుబాటు లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఓటమిని స్వాగతించారు. మున్ముందు అన్ని ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఒకటి అనుకుంటే మరొకటి అయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అంటూ కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+