టీడీపీ-జనసేనపై షర్మిల ఎఫెక్ట్ ! గెలిచే సీట్లివే ? రఘురామ జోస్యం !
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ అధికార వైసీపీ లీడ్ లో ఉన్నట్లు కనిపించింది. విపక్ష టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంతో వైసీపీకి పోటీ ఇచ్చే స్ధాయికి చేరిందని భావిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల రూపంలో మూడో శక్తి ఎంటర్ కావడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతోందో చెప్పేశారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ అంచనా వేశారు. అధికార వైసీపీకి చెందిన సంప్రదాయ ఓట్లు 5 నుంచి 7 శాతం షర్మిల చీల్చడం ఖాయమన్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి అధికారం సాధించబోతోందని రఘురామ జోస్యం చెప్పారు. ఇరు పార్టీలకు కలిపి 135 నుంచి 155 సీట్లు రావడం ఖాయమని ఆయన అంచనా వేశారు.

కాంగ్రెస్ పార్టీలో తాజాగా చేరిన వైఎస్ షర్మిలకు ఆ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. త్వరలో ఆమె బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు. షర్మిల ఎంట్రీతో వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన రెడ్లతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో చీలిక వస్తుందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇది ఎంత శాతం ఉండబోతోందన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రఘురామ నరసాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications