టీడీపీ కంచుకోటలో వైసీపీ కీలక నేత పై జగన్ వేటు..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పార్టీల్లో చేరికలు.. రాజీనామాలు కొనసాగు తున్నాయి. కాగా.. వైసీపీలో ఉత్తరాంధ్ర సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ ముఖ్య నేత లతో జగన్ సమావేశం అవుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గం లో వైసీపీ ముఖ్య నేత పైన సస్పెన్షన్ వేటు వేయటం ఆసక్తి గా మారుతోంది.
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ పైన ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్ లకు స్పష్టత ఇచ్చారు. కూటమి నుంచి ఎలాంటి ఒత్తిడి ఉన్నా.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా పార్టీ నుంచి ప్రతీ చోటా అభ్యర్ధులు బరిలో నిలవాలని.. లేకపోతే, నియోజక వర్గ ఇంఛార్జ్ లకు వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని తేల్చి చెప్పారు. అటు ఉత్తరాంధ్రలో మజ్జి శ్రీను వైసీపీ వీడి టీడీపీలో చేరారు. మరి కొందరు నేతలు మజ్జి శ్రీను బాటలోనే వెళ్తున్నారనే ప్రచారం పార్టీ లో కొనసాగుతోంది. ఈ సమయంలోనే బొత్సా సహా.. ఇతర నేతలతో జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న రేపల్లె నియోజకవర్గానికి చెందిన నేత పై జగన్ చర్యలు తీసుకున్నారు.

జగన్ తాజా నిర్ణయాల పై చర్చ
రేపల్లె నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో తరువాత కొందరు కీలక నేతలు వైసీపీలో చేరారు. స్థానికంగా మారుతున్న సమీకరణాలతో వైసీపీ కండువా కప్పుకున్నారు. వారిలో కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాస రావు నియోజకవర్గంలో పట్టు ఉంది. పార్టీలో భవిష్యత్ లో కీలక స్థానం కల్పిస్తానని చేరిక సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు అదే నేత పైన సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో, విచారణ చేపట్టిన క్రమశిక్షణా కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు YCP స్పష్టం చేసింది. పార్టీలో చేరిన ఆరు నెలల కాలంలోనే వేటు పడటంతో.. ఈ నిర్ణయం స్థానిక ఎన్నికల వేళ ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది.













Click it and Unblock the Notifications
