పవన్ తో బాలినేని, సామినేని ఉదయభాను భేటీ-జనసేనలో చేరాక ఇచ్చే పదవులివేనా ?
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలో ఎదురవుతున్న పరిస్ధితుల నేపథ్యంలో కీలక నేతలైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తాజాగా ఆ పార్టీని వీడారు. వీరిద్దరూ ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. జనసేన పార్టీలో చేరేందుకు వీరిద్దరూ తమ ఆసక్తిని పవన్ కళ్యాణ్ కు తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవాళ మధ్యాహ్నం బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వేర్వేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వైసీపీని వీడాల్సిన పరిస్ధితులపై ఆయనకు వివరించారు. అలాగే జనసేనలోకి వచ్చాక తమకు లభించే గౌరవంపైనా చర్చించారు. ఈ మేరకు పవన్ వారికి కీలక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ తరహాలో కాకుండా సీనియర్ నేతలకు కీలక పదవులు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. బాలినేని, సామినేని ఉదయభాను ఇద్దరికీ ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత బయటికి వచ్చిన సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. జగన్ విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీకి తక్షణం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో ప్రయాణం చేసే వాళ్ళని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ నెల 22న జనసేన పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications