Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ గైర్హాజరీలో వైసీపీలో అనూహ్య మార్పు..!

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీలో తాజాగా ఓ అనూహ్య మార్పు కనిపిస్తోంది. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గతంలో, ప్రస్తుతం విపక్షంలో ఉన్నప్పుడు కూడా కనిపించని ఓ కొత్త మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు పార్టీలో ఉన్న వారి కంటే బయటి వారే ఎక్కువగా గమనిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కూడా ఈ మేరకు పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదంతా అధినేత వైఎస్ జగన్ గైర్హాజరీలోనే జరుగుతుండటం మరో విశేషం.

వైసీపీలో అనూహ్య మార్పు

విపక్ష వైసీపీలో ప్రస్తుతం ఓ అనూహ్య మార్పు కనిపిస్తోంది. పార్టీ అధినేత జగన్ విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న పలు ప్రదాన సమస్యలపై నేతలు, క్యాడర్ మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటాలు చేస్తున్నారు. అలాగని ప్రస్తుతానికి ఎన్నికలు ఉన్నాయా అంటే అదీ లేదు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం పార్టీ ఏ పిలుపు ఇచ్చినా క్షేత్రస్ధాయిలో చురుగ్గా స్పందించి నిరసనల్లో కనిపిస్తున్నారు. దీంతో అధికార పక్షానికి జగన్ విదేశాల్లో ఉండి కూడా ఊపిరి ఆడనివ్వడం లేదనే చర్చ జరుగుతోంది.

YSRCP Shows Major Attitude Shift in Jagan Mohan Reddy s Absence

జగన్ లేకున్నా జనంలోకి..

గతంలో పార్టీ ఓటమి పాలయ్యాక జగన్ రాష్ట్రంలో ఏదైనా టూర్ పెట్టుకుంటేనే అక్కడి వైసీపీ నేతలు స్పందించేవారు. జనంలోకి తిరగడం ప్రారంభించేవారు. చివరికి జగన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన ముందు హడావిడి చేయాలన్న తపన వారిలో కనిపించేది. అదే సమయంలో ఎక్కువగా హడావిడి చేసి అరెస్టులు, హౌస్ అరెస్టులు కూడా అయ్యేవారు. కానీ ఇప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ పార్టీ నేతలు, నాయకులు, క్యాడర్ కూడా వేగంగా స్పందిస్తున్నారు.

అంతా తానే నడిపిస్తున్న సజ్జల

జగన్ సీఎంగా ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అన్నీ తానే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కీలక నియామకాలు పూర్తి కావడంతో ఇప్పుడు వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనేలా చూసుకుంటున్నారు. ఎక్కడైనా సమన్వయం లేకపోతే తానే నేరుగా నేతలతో మాట్లాడి పరిష్కారాలు చూపుతున్నారు. దీంతో పార్టీ జగన్ లేకపోయినా ఏకతాటిపై ఉంటూ క్షేత్రస్దాయిలో దూకుడు ప్రదర్శిస్తోంది.

YSRCP Shows Major Attitude Shift in Jagan Mohan Reddy s Absence

కలిసొస్తున్న మార్పు

వైసీపీలో నిన్న మొన్నటి వరకు జగన్ ఉంటేనే నాయకుల యాక్టివ్ మోడ్ లో ఉండేవారు లేకుంటే సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోయేవారనే పేరుంది. అలాంటిదిఈసారి జగన్ లండన్ కి వెళ్ళిన ఈ సమయంలో కూడా పార్టీ ఫుల్ యాక్టివ్ గా ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై గానీ కల్తీ మద్యంపై కానీ నాయకులు కార్యకర్తల పోరాటం ఇతరులకు స్పూర్తినిస్తోంది. ప్రతిదానికి జగన్ పై ఆధారపడకుండా ఎక్కడికక్కడ సమస్యలను హైలెట్ చేయడం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకొనిపోతుండటం వైసీపీకి కలిసొస్తోంది. అందుకే వైసీపీ లేవనెత్తుతున్న సమస్యలపై స్వయంగా సీఎం చంద్రబాబే స్పందించాల్సి వస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+