అడ్డంగా దొరికిపోయిన జానీ మాస్టర్ (వీడియో)

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. జనసేనలో చేరగానే ఆయనకు పదవి కూడా దక్కింది. జనసేన ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్‌గా జానీ మాస్టర్‌ని నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన జానీ మాస్టర్ జగన్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

ఈక్రమంలోనే నెల్లూరు జిల్లాలో పర్యటించిన జానీ మాస్టర్.. అక్కడ టిడ్కో ఇళ్లను పరిశీలించారు. నాసిరకమైన ఇళ్లన కట్టి ప్రజలను మభ్యపెట్టాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని జానీ మాస్టర్ విమర్శలు చేశారు. ఆయన అక్కడితో ఆగకుండా ప్రభుత్వ పెద్దలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలు మద్యానికి బానిసలుగా మారుతున్నారని...నాసిరకం మద్యాన్ని అందిస్తూ ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ysrcp social media trolling on johnny master

అయితే మద్యం గురించి చెప్పే సమయంలో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మద్యం గురించి జానీ మాస్టర్ మాట్లాడుతూ..మద్యం బాటిల్ ధర రూ. 300గా ఉందని రోజుకు ఒక బాటిల్ చొప్పున నెలకు లక్ష రూపాయిలు మద్యానికి ఖర్చు పెడుతున్నారని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు.

అయితే నెలకు రూ. 9000 అని చెప్పబోయి లక్ష రూపాయిలని చెప్పడంతో ఆయన సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో జానీ మాస్టర్‌ని వైసీపీ సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటుంది. ఒక బాటిల్ ఖరీదు రూ. 300 అయితే రోజు తాగితే అప్పుడు 9000 అవుతుంది కానీ లక్ష ఎలా అవుతుందో జానీ మాస్టరే దీనికి సమాధానం చెప్పాలంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి టిడ్కో ఇళ్లు కట్టింది చంద్రబాబు హయంలోనే.

ఇది తెలియని జానీ మాస్టర్ వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేశాడు.దీనిపై కూడా వైసీపీ అభిమానులు జానీ మాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా అంటూ జానీ మాస్టర్‌పై వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఓటు వేసిన జానీ మాస్టర్‌కు .. ఏపీలో రాజకీయాలు గురించి మాట్లాడే అర్హత , హక్కు లేదని .. అదుపు తప్పి తమ నాయకుడు గురించి మాట్లాడితే తాట తీస్తామంటూ వైసీపీ కార్యకర్తలు జానీ మాస్టర్‌కు వార్నింగ్ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+