వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కోసం వేట!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ ఇప్పుడు అసలు కనిపించడంలేదు. తమ వాయిస్ ను కూడా వినిపించడంలేదు. కొంతమంది తమ ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసుకోగా మరికొందరు మాత్రం తాము ఎంతో పవిత్రమైనవారిమన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే మొన్నటి మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడినట్లుగా. కొందరు తమ ఇళ్లను ఖాళీ చేసి గుర్తు తెలియని ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రధానంగా ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ ఎక్కడున్నారనేది ఇప్పుడు తెలియడంలేదు.
హైదరాబాద్ లో లేని సజ్జల భార్గవ
సజ్జలతోపాటు ఆయన కుటుంబం మొత్తం హదరాబాద్ వెళ్లిపోయింది. అయితే ఆయన హైదరాబాద్ లో కూడా లేరని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ రెడ్డిలాంటివారు వైసీపీ సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. వారంతా ఎక్కడున్నారనేది తెలియడంలేదు. కొందరు ఊళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయారని చెబుతున్నారు. గతంలో తాము ఎక్కడా అమర్యాదగా ప్రవర్తించలేదని, ఎంతో మర్యాదగానే వ్యవహరించామని చెబుతున్నారు.

గీతాంజలి మృతిలో కూడా అనుమానమే
చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మహిళా నేతలతోపాటు అగ్ర నేతలపై అసభ్యంగా మాట్లాడుతూ, వారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడినవారందరివేట ప్రారంభమవుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని తేల్చిచెబుతున్నారు. వాస్తవానికి వీరంతా రేపు అనేది లేదు అన్నట్లుగా చెలరేగిపోయారని, కానీ ఆ రేపు అనేది ఉంటుందని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. సజ్జల భార్గవపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గీతాంజలి మృతి విషయంలో కూడా ఆయనపై అనుమానం ఉన్నట్లుగా టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ కోణంలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కోసం ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెదుకులాటలు మొదలుపెట్టాయి.












Click it and Unblock the Notifications