అతను అలా కాదు కానీ..: బాలకృష్ణపై జగన్ పార్టీ సాఫ్ట్ కార్నర్!

విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర టిడిపి నేతల పైన దుమ్మెత్తి పోసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టిడిపి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విషయంలో మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

తాజాగా, వైసిపి ఎమ్మెల్యే రోజా మాటలు కూడా అందుకు అద్దం పడుతున్నాయి. మహిళల విషయంలో చంద్రబాబు, నారా లోకేష్, మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్, ఇతర నేతలను రోజా దుయ్యబట్టారు. అయితే, బాలకృష్ణ విషయంలో మాత్రం ఆచితూచి స్పందించారు.

అందుకు బాలకృష్ణ నటుడు కావడమే కారణం కావొచ్చు. ఇటీవల బాలకృష్ణ ముద్దు, గర్భం అంటూ వ్యాఖ్యానించారు. అవి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై రోజా మాట్లాడుతూ.. బాలకృష్ణ టంగ్ స్లిప్ అయ్యారని, ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేవిగా ఉన్నాయన్నారు.

 YSRCP softness on Hero and TDP MLA Balakrishna

బాలకృష్ణ గతంలో ఇలా మాట్టాడలేదని, ఆయన అనుకోకుండా నోరు జారితే క్షమాపణ చెప్పాలని సూచించారు. నారా లోకేష్, ఇతర టిడిపి నేతలను చూసి బాలకృష్ణ మాట్లాడినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇందుకు బాలకృష్ణ నటుడు కావడం, ఆయనకు ఉన్న ఇమేజ్ కారణం కావొచ్చంటున్నారు.

పలు అంశాలపై బాలకృష్ణను విమర్శిస్తున్నప్పటికీ.. మిగతా టిడిపి నేతలతో పోల్చుకుంటే కొంత సున్నితం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. అయితే, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సాక్షి మీడియా మాత్రం ఘాటుగానే స్పందించింది. వైసిపి నేతలు మాత్రం సాఫ్టుగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+