చంద్రబాబు ఫెయిల్ -ఇదే సాక్ష్యం-60 ఏళ్ల క్రితం వరదల క్లిప్ తో వైసీపీ విమర్శలు..!
ఏపీలోని విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బుడమేరు వరదల్ని అడ్డుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందంటూ విపక్ష వైసీపీ విమర్శిస్తుండగా.. అధికార పక్షం మాత్రం వరద సహాయక చర్యల్లో దూకుడుతో దాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో గతంలో బుడమేరు వరదలు వచ్చినప్పుడు పరిస్ధితులతో ఇప్పటి నష్టాల్ని పోలుస్తూ వైసీపీ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది.
వైసీపీ పెట్టిన పోస్టులో గతంలో 1965లో వచ్చిన బుడమేరు వరదలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ఒకటి ఉంది. అప్పట్లో బుడమేరు వరదలు వచ్చినప్పుడు కూడా 40 వేల క్యూసెక్కుల నీరే వచ్చిందని, కేవలం 10 మందే గల్లంతయ్యారని, కానీ ఇప్పుడు అంతే వరద వచ్చినా నష్టం ఎక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ అధికార కూటమిపై విమర్శలు గుప్పిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ పెరిగినా నష్టాన్ని మాత్రం నివారించలేకపోయారంటూ కూటమిని టార్గెట్ చేస్తోంది.

60 ఏళ్ల క్రితం బుడమేరుకి 40 వేల క్యూసెక్కుల వరద వచ్చినా, జరిగిన ప్రాణనష్టం 10 మందే అని అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదని వైసీపీ ట్వీట్ లో గుర్తుచేసింది. కానీ.. ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండి.. టెక్ సీఎంగా పోజులు కొట్టే చంద్రబాబు అధికారంలో ఉండగా బుడమేరు వరదతో చనిపోయిన వారు 50 మందిపైనే అని ఆరోపించింది. చంద్రబాబు అట్టర్‌ప్లాప్ సీఎం అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది. ఇప్పటికే వరద సహాయక చర్యల విషయంలో చంద్రబాబు తీరుపై విమర్శలు చేస్తున్న వైసీపీ ఇప్పుడు ఈ క్లిప్ ను వైరల్ చేస్తోంది.
.@ncbn సొల్లు తప్ప.. బుర్రంతా ఒట్టి డొల్ల
— YSR Congress Party (@YSRCParty) September 8, 2024
60 ఏళ్ల క్రితం బుడమేరుకి 40 వేల క్యూసెక్కుల వరద వచ్చినా.. జరిగిన ప్రాణనష్టం 10 మంది. అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు
కానీ.. ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండి.. టెక్ సీఎంగా పోజులు కొట్టే చంద్రబాబు అధికారంలో ఉండగా బుడమేరు వరదతో… pic.twitter.com/4soEoMjN7O












Click it and Unblock the Notifications