వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అదే అలవాటు లోకేష్‌కు': మరోసారి జూ.ఎన్టీఆర్‌తో బాబును ఇరుకున పెట్టే యత్నం!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వాడుకొని వదిలేశారని ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరోపించింది. వైసిపి నేతలు పలుమార్లు జూ.ఎన్టీఆర్‌ను లాగి, చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, మరోసారి వారు జూనియర్ ఎన్టీఆర్ పేరును లాగారు. వైసీపీ నేత అంబటి తాజాగా బాబుపై మండిపడ్డారు. అవసరం ఉన్న సమయంలో వాడుకోవడం, ఆపై వదిలేసి అవమానాల పాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.

YSRCP tries to corner Chandrababu with Jr NTR name

అదే అలవాటు నారా లోకేష్‌కు వచ్చిందన్నారు. గత ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఇలాగే వాడుకొని వదిలేశారని ఆరోపించారు. అలాగే, ఇప్పుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కాపులను వాడుకొని, అధికారంలోకి వదిలేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

నారా లోకేష్, చినరాజప్పల వీడియోలను ఎడిట్ చేసి విడుదల చేశారన్నారు. ఎడిట్ చేయని కాపీ బయటకు వస్తే అసలు విషయం బయటపడుతుందన్నారు. అప్పుడు చంద్రబాబుకు తమ పరువు పోతుందని తెలుసునని చెప్పారు. టిడిపి తన అధికార సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టును తిరిగి ఎందుకు తొలగించిందో చెప్పాలన్నారు. కుల రాజకీయాలు సరికాదన్నారు.

English summary
YSRCP tries to corner AP CM Chandrababu Naidu with Jr NTR name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X