వైసీపీ ఫీజు పోరుకు ఈసీ బ్రేక్?: లేఖ
YSRCP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మరో ఉద్యమానికి సిద్ధమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఫీజు పోరుకు తలపెట్టింది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, పార్టీ శ్రేణులు సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్లను సైతం విడుదల చేశారు. అన్ని జిల్లాల్లోనూ పోస్టర్ల కార్యక్రమాన్ని ఇదివరకే చేపట్టారు.

తల్లికి వందనం కింద 3,900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తోన్నారంటూ వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. బకాయిలు ఉన్నందున విద్యార్థులకు కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదంటూ ఆరోపిస్తోన్నారు.
ఫలితంగా- ఉన్నత విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారంటూ వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను విడుదల చేశారని గుర్తు చేశారు.
ఈ పరిణామాల మధ్య ఫీజు పోరు ఉద్యమానికి ఎన్నికల కోడ్ అడ్డుపడటం ఖాయంగా కనిపిస్తోంది. గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయడమే దీనికి కారణం.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అప్రమత్తమైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డు లేకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో- కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్ఆర్సీపీ లేఖ రాసింది. ఫీజు పోరును నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications