Palnadu: పల్నాడులో ఆగని దాడుల పర్వం-ఎంపీ లావు, అంబటి అల్లుడి కార్ల ధ్వంసం..!
ఏపీలోని పల్నాడు ప్రాంతంలో ఎన్నికల హింస చెలరేగింది. ఉదయం నుంచి చెదురుమదురు ఘటనలతో ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం కల్లా దాడులకు దారి తీసింది. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఈ పోరులో నేతలు పరస్పరం దాడులకు దిగడం, ఆస్తుల విధ్వంసం కూడా చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల సాయంతో ఈసీ వీటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నా అదుపులోకి రావడం లేదు.
మాచర్లలో కూటమి తరఫున పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి కారును ఉదయం ప్రత్యర్థులు ధ్వంసం చేసారు. అనంతరం నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు కారును కూడా ధ్వంసం చేశారు. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ కారుతో పాటు మరో జనసేన నేత కార్లు కూడా ఈ దాడుల్లో ధ్వంసం అయ్యాయి. దీంతో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.

Ycp leaders attacked TDP leader Nellore Rama Kotaiah in Nadikudi village of Gurjala constituency of Palnadu district. pic.twitter.com/eTQbSUmyma
— Anam Venkata Ramana Reddy (@anamramana) May 13, 2024
నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుపై దాడికి ప్రత్యర్దులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన కారుతో పాటు మరో మూడు కార్లు ధ్వంసం చేశారు. ఈ ఘటన నుంచి లావు సురక్షితంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అటు పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు పార్టీలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications