భూమా ఫ్యామిలీపై జగన్ మామ తీవ్రవ్యాఖ్య, ఆది ఎఫెక్ట్.. కేశవరెడ్డిని లాగారు

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని బాపట్ల వైసిపి ఎమ్మెల్యే కోన రఘుపతి మహానందిలో అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించడానికి జగన్ త్వరలో పాదయాత్ర చేస్తున్నారన్నారు.

టిడిపిలో చేరినందుకు గర్వంగా ఉంది: అఖిల, వైసిపి సర్పంచ్‌లు రాలేదు: లోకేష్

ఉప ఎన్నికల్లో భారీగా విజయం సాధించి నంద్యాల నుంచి వైసిపి జైత్రయాత్ర ప్రారంభిస్తుందని జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వేరుగా అన్నారు. గోస్పాడు మండలం దీబగుంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రఘురామి రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు.

భూమా కుటుంబంపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు

భూమా కుటుంబంపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు

శిల్పా మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని రవీంద్రనాథ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్షనిస్టులకు, రౌడీలకు నంద్యాలలో స్థానం లేదని భూమా కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నుంచి గెలిచి ఎందరో ఉన్నత పదవులను అలంకరించారన్నరు. టిడిపి ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దన్నారు.

YS Jagan Shock To Bhuma Akhila Priya
ఎందుకో గ్రహించండి

ఎందుకో గ్రహించండి

గత మూడేళ్లలో అభివద్ధిని పట్టించుకోని ప్రభుత్వం ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రగతి అంటూ గొప్పలకు పోతోందని రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందులోని ఆంతర్యాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

కేశవరెడ్డిని లాగిన రవీంద్రనాథ్

కేశవరెడ్డిని లాగిన రవీంద్రనాథ్

కేశవ రెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవ రెడ్డి.. విద్యార్థుల తల్లిదండ్రులకు వందల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టారని, ప్రస్తుతం మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఆయన స్వయానా బంధువు అని, తల్లిదండ్రులకు న్యాయం చేయలేకపోతున్నారని, ఏ మొహం పెట్టుకొని నంద్యాల ప్రజల ముందు ఆదినారాయణ రెడ్డి తిరుగుతున్నారో చెప్పాలని రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.

నన్ను గెలిపించండి.. శిల్పా

నన్ను గెలిపించండి.. శిల్పా

టిడిపి చెప్పే కల్లిబొల్లి మాటలు నమ్మవద్దని మరో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంత్రులు నంద్యాలలో మకాం వేసి గాలిలో మేడలు కడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చూడలేకే తాను వైసిపిలో చేరానని నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. మూడేళ్ల పాలనలో టిడిపి చేసిందేమీ లేదని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party leaders Srikanaht Reddy, Ravindranath Reddy, Gangula Pratap Reddy said that party candidate Shilpa Mohan Reddy will win in Nandyal bypoll.
Please Wait while comments are loading...