మీ తండ్రి సచిన్ కాళ్లు పట్టుకున్నది మర్చిపోయారా?: బండ్ల గణేష్ అరెస్టుకు వైసీపీ డిమాండ్
Recommended Video

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేశ్‌కు, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మధ్య జరిగిన మాటల యుద్దం జనాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది. ప్రస్తావించడానికి కూడా వీల్లేని రీతిలో ఇద్దరూ దిగజారుడు విమర్శలు చేసుకున్నారు.
టీవి9 వేదికగా జరిగిన ఆ తతంగం చాలామందికి రోత పుట్టించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ను అరెస్ట్ చేయాలని వైసీపీ మహిళా నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అనంతరం వైసీపీ మహిళ నేత బండి పుణ్యశీల మీడియాతో మాట్లాడారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని, ఆయనకు ధైర్యముంటే ఫోన్ స్విచ్చాన్ చేయాలని విరుచుకుపడ్డారు. బండ్ల గణష్ విజయవాడ వచ్చి మాట్లాడాలని, అసలు ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయననకేంటని ప్రశ్నించారు.
'మీ పై హీరోయిన్ మీరా చోప్రా చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా? మీపై హీరో సచిన్ జోషి పెట్టిన కేసు విషయమై మీ తండ్రి హీరో కాళ్లు పట్టుకున్నసంగతి మర్చిపోయారా?' అని బండ్ల గణేష్ ను నిలదీశారు. రోజాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications