రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు : ఎస్పీకి చేరిన పంచాయితీ
మాజీ మంత్రి ఆర్.కె. రోజాపై నగరి శాసనసభ్యుడు గాలి భాను ప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గతంలో నగరి సీఐకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో, ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.
మహిళా నాయకుల ఆవేదన
ఈ నేపథ్యంలో, ఈ రోజు నగరి నియోజకవర్గానికి చెందిన మహిళా ప్రతినిధులు చిత్తూరు జిల్లా పోలీసు అధికారి గౌరవనీయులు ఎస్పీమణికంఠ కలిశారు. మాజీ మంత్రి రోజా తరపున ఆయనకు వినతిపత్రం సమర్పించి, తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా నాయకురాలిపై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సమాజంలో మహిళల గౌరవాన్ని నిందించడమే. ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదు, మహిళలందరిపై జరిగిన దాడిగా భావించాలని వారు తీవ్రంగా ఖండించారు.

తక్షణ చర్యలకు డిమాండ్
గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి, శాసనసభ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఎస్.పీ.ని బలంగా కోరారు. మహిళల భద్రత, గౌరవం కోసం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జనరల్ సెక్రెటరీ గాయత్రీ దేవి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షురాలు హరీష రెడ్డి, పుత్తూరు మున్సిపాలిటీ పట్టణ మహిళా అధ్యక్షురాలు, కౌన్సిలర్ జయలక్ష్మి, కౌన్సిలర్ భానుమతి చక్రి తదితర నియోజకవర్గ మహిళా నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications