మైసూరులో దోసె రుచి అవాక్కయిన వైసీపీ ఎంపీ?
అమరావతి/బెంగళూరు: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆలయాన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శంచుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు.
దసరా అనగానే- అందరికీ గుర్తుకొచ్చే పేరు మైసూరు. ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలా ప్రత్యేకం. కన్నడిగుల ఇలవేల్పు చాముండేశ్వరి అమ్మవారిని విజయదశమి నాడు అంబారీపై ఎక్కించి ఊరేగిస్తారు. దీన్నితిలకించడానికి ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు మైసూరుకు చేరుకుంటుంటారు.

ఈ తొమ్మిది రోజులపాటు చాముండీశ్వరి అమ్మవారిని వివిధ శక్తి రూపాలతో పూజిస్తారు. దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళికా, విజయ చాముండేశ్వరీ రూపాలతో కొలుస్తారు. ఈ ఏడాదీ కన్నుల పండువగా మైసూరులో దసరా వేడుకలు కొనసాగుతున్నాయి. మైసూరు నగరం మొత్తాన్నీ విద్యుద్దీపాలతో అలంకరించారు. వడెయార్ రాజకుటుంబీకులు నిర్వహించే దర్బార్ ఇక్కడి ప్రత్యేకత.

దసరా వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ పరిమళ్ నథ్వాని.. మైసూరులో ప్రత్యక్షం అయ్యారు. మైసూరు వినాయక మైలారి అనే ఓ చిన్న హోటల్‌లో దక్షిణాది ఫుడ్ రుచి చూశారు. దోసె తిన్నారు.
దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మైసూరు లోని ఫేమస్ వినాయక మైలారి హోటల్‌లో ఉన్నానని, సౌత్ ఇండియన్ ఫుడ్‌ను టేస్ట్ చేశానని రాసుకొచ్చారు. ఈ హోటల్‌కు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉందని, రుచికరమైన దోసెలను అందించిదని చెప్పారు.

1938లో స్థాపించిన హోటల్ ఇది. మైసూరు నజారాబాద్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ లభించే ఫుడ్ కోసం చాలామంది వీఐపీలూ వస్తుంటారు. గతంలో పలువురు రాజకీయ నాయకులు ఈ హోటల్‌ను విజిట్ చేశారు.












Click it and Unblock the Notifications