వైసీపీ పాచిక పారింది..
Kadapa ZP Chairman election: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో పాగా వేయాలనుకున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకోగలిగింది. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ రామగోవింద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి ఆయన ప్రాతనిథ్యాన్ని వహిస్తోన్నారు.

షెడ్యూల్ ప్రకారం.. జెడ్పీ ఛైర్మన్ ఎంపిక నేడు జరగాల్సి ఉంది. ఈ ఉదయం 11 గంటలకు ఛైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. గడువు సమయానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. దాన్ని
నున్నారు. జిల్లాపరిషత్ లో మొత్తం 50 మంది జడ్పీటీసీల్లో వైసీపీకి 38 మంది జడ్పీటీసీల మద్దతు ఉంది. దీంతో, జిల్లా పరిషత్ వైసీపీ కైవసం అయ్యే అవకాశం ఉంది. జడ్పీ ఛైర్మన్ రేసులో తాము లేమని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. రామగోవిందరెడ్డి దాఖలు చేశారు. మరో నామినేషన్ అందకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఈ ఎన్నికను ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు.
ఒకే ఒక్క నామినేషన్ వేసిన రామగోవిందరెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇదివరకు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి పని చేసిన విషయం తెలిసిందే. ఆయన శాసన సభకు ఎన్నిక కావడం వల్ల తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా దీనికి ఎన్నిక నిర్వహించారు.
ఇదివరకే- బ్రహ్మంగారిమఠానికి చెందిన మండలం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని వైసీపీ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నిక నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు సైతం నడిచాయి. తన జడ్పీటీసీలను హైదరాబాద్‌కు తరలించింది వైఎస్ఆర్సీపీ. ఎన్నిక నేపథ్యంలో వాళ్లంతా కడపకు చేరుకున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉండగా.. మెజారిటీ అంటే 49 మంది వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్లే. గోపవరానికి చెందన జెడ్పీటీసీ మాత్రమే టీడీపీ నాయకుడు. ఈ పరిణామాల మధ్య మరో నామినేషన్ పత్రం దాఖలు కాకపోవడంతో రామగోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications