పవన్ సమక్షంలో చంద్రబాబుకు లోకేష్ గిఫ్ట్ - ఎన్నికల కీలక హామీ ప్రకటన..!!
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద పాదయాత్ర ముగినుంది. దీంతో యువగళం ముగింపు సభకు టీడీపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. వపన్ కల్యాణ్ సైతం ఈ సభకు హాజరు కానున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్దమవుతున్నారు. ఇక..ఈ సభలో గుర్తిండిపోయేలా ఎన్నికల ప్రణాళికలోని కీలక హామీ ప్రకటన పైన కసరత్తు జరుగుతోంది. చంద్రబాబుకు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు లోకేష్ వెల్లడించారు.
ముగింపు సభ వేళ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ రోజుతో పరిసమాప్తం కానుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్రలో లోకేష్ 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు.. మునిసిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా యాత్ర సాగించారు.

70 బహిరంగసభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, ఎనిమిది రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4,353 వినతిపత్రాలు అందుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలతో ఆయన మమేకమయ్యారు. ఎన్నికల వేళ ఈ యువగళం యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.
ఎన్నికల సమరశంఖం: ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నిర్వహించి, అక్కడ ముగింపు సభ ఏర్పాటుచేయాలని భావించినప్పటికీ.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అగనంపూడి వద్దే ముగిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు రోజులపాటు 113 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు 97 నియోజకవర్గాల్లో 70 బహిరంగ సభల్లో లోకేష్ ప్రసంగించారు.
రాయలసీమలోనే లోకేశ్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఏకంగా 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587 కిలోమీటర్లు నడిచారు. 'సెల్ఫీ విత్ లోకేశ్' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇక..ఈ యాత్రకు మంచి ముగింపు ఇవ్వాలని భావించారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నందమూరి బాలయ్యతో పాటుగా నారా - నందమూరి కుటుంబ సభ్యులు 175 నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు హాజరు కానున్నాయి.

చంద్రబాబు - పవన్ కీలక ప్రకటన: ముగింపుబ సభకు హాజరయ్యే వారి కోసం 11 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసారు. దాదాపు ఆరు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ సభలో నారా లోకేష్ అందరి సమక్షంలో చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. పార్టీ నేతలు..కార్యాకర్తలను ఎవరైతే ఈ నాలుగున్నారేళ్ల కాలంలో వేధించారో వారి వివరాలతో రాసిన రెడ్ బుక్ ను అందరి సమక్షంలో అందిస్తానని చెప్పారు.
ఇక..చంద్రబాబు - పవన్ ఎన్నికల సమాయత్తం పైన కీలక ప్రకటన చేయనున్నారు. దీంతో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా భావిస్తున్న రైతు రుణ మాఫీ పైన ఈ సభా వేదిక నుంచే ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఈ సభ ద్వారా ఏపీలో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారనుంది.












Click it and Unblock the Notifications