కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుపాకీతో సమావేశాలకు హాజరైన సభ్యుడు, ఎమ్మెల్యే మందలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ చర్ల నారాయణ రెడ్డి లైసెన్స్‌డ్‌ ఆయుధంతో హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమావేశానికి ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హాజరయ్యారు.

నారాయణ రెడ్డి కాటారం జెడ్పీటీసీ. ఆయన తుపాకీతో సమావేశానికి హాజరు కావడం పైన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు అభ్యంతరం తెలిపారు. జెడ్పీ చైర్ పర్సన్ మందలింపుతో ఆయుధాన్ని వెనక్కి ఇచ్చారు.

 ZPTC attends meetings with gun

నారాయణ రెడ్డి తన తుపాకీని గన్‌మెన్‌కు ఇచ్చి తిరిగి సమావేశానికి హాజరయ్యారు. జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న సమయంలో తుపాకీ తీసుకు రావడం మంచిది కాదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మరోసారి ఇలా తేవొద్దని ఎమ్మెల్యే సూచించారు.

ఆదిలాబాద్‌ జెడ్పీ సీఈఓ నియామకంపై వివాదం

ఆదిలాబాద్‌ జిల్లాలో జెడ్పీ సీఈవో నియామకంపై వివాదం రాజుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన శేషాద్రిని ప్రభుత్వం జెడ్పీ ఇంచార్జ్ సీఈఓగా నియమిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఆయన నియామకాన్ని జిల్లాకు చెందిన మంత్రులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం.

English summary
Congress ZPTC attends meetings with gun in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X