ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా మృతి -అర్జెంటీనాలోని సొంతింట్లో గుండెపోటు రావడంతో
ఫుట్‌బాల్ అనే ఆటకు పర్యాయపదంగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పొందిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం డిగో మారడోనా(60) ఇక లేరు. కొన్ని రోజుల కిందటే బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లోనే చికిత్స కొనసాగుతున్న క్రమంలో బుధవారం సడెన్ గా ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయారని అర్జెంటీనా మీడియా సంస్థలు వెల్లడించాయి.
మారడోనా మరణ వార్తతో క్రీడాలోకం షాక్ కు గురైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని ఆయన ఇంటికి వేలాది మంది అభిమానులు క్యూ కట్టారు. దీంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మెదడులో రక్తం గడ్డ కట్టిన ఇబ్బందులతో మారడోనా ఈ నెల ఆరంభంలోనే ఆస్పత్రిలో చేరగా, ఆపరేషన్ విజయవంతమైంది. ఇక తేరుకుంటాడని అభిమానులు ఆశించేలోపే చేదు వార్త వినాల్సి వచ్చింది.

1986లో అర్జెంటీనాకు ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించిన మారడోనా.. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో డిగో జన్మించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడలో తనదైన ముద్రవేసిన మారడోనా మరణ వార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అర్జెంటీనా తరఫున 96 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన మారడోనా మొత్తం 34 గోల్స్ చేశారు. పీలే తర్వాత అంతటి పాపులారిటీ సాధించిన డిగో.. కెరీర్ ద్వితీయార్థంలో డ్రగ్స్ కు బానిసయ్యారు. 1991లో డోపింగ్ పరీక్షలో పట్టుబడి 15 నెలలు నిషేధానికి గురయ్యారు. నాలుగుసార్లు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు ప్రాతినిధ్యం వహించిన మారడోనా 1997లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్టుకు మేనేజర్‌గా కూడా మారడోనా పనిచేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications