Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

India vs Pakistan 2022: రెండు జట్ల మధ్య మ్యాచ్‌గా కంటే రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంగా..!

అబుధాబి: ఎప్పుడెప్పుడా అంటూ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తోన్న ఆసియా కప్ మెగా టోర్నమెంట్ వచ్చేసింది. ఇవ్వాళ తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

రేపే హైఓల్టేజ్..

రేపే హైఓల్టేజ్..

రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఇదే దుబాయ్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాబర్ ఆజమ్ సేనతో తలపడనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దాన్ని మ్యాచ్‌గా మాత్రమే చూడరు అభిమానులు. అంతకుమించి అనే స్థాయిలో ఉంటుంది.

టీవీలకు అతుక్కుపోయి..

టీవీలకు అతుక్కుపోయి..

తెలియకుండానే ఓ హై ప్రెషర్ ఏర్పడుతుంటుంది. అభిమానులు భావోద్వేగాలకు గురి అవుతుంటారు. రెండు జట్ల మధ్య మ్యాచ్‌గా కంటే రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంగా భావిస్తుంటారు ఫ్యాన్స్. టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ చూస్తారు. రోడ్డు పక్కన షోరూమ్ లేదా ఏదైనా షాప్‌లో టీవీలో మ్యాచ్ టెలికాస్ట్ అవుతోంటే అక్కడే నిల్చుని మ్యాచ్‌ను చూసే అతి అరుదైన సన్నివేశాలు భారత్-పాకిస్తాన్‌కు మాత్రమే సాధ్యం. ఈ రెండు దేశాల్లో అదే తరహా వాతావరణం కనిపిస్తుంటుంది.

మ్యాచ్ గెలిచిన తరువాత..

మ్యాచ్ గెలిచిన తరువాత..

తమ భావోద్వేగాలను దాచుకోడు భారత సగటు క్రికెట్ అభిమానులు. పాకిస్తాన్‌పై భారత్ మ్యాచ్ గెలిచిన తరువాత చోటు చేసుకునే సంబరాలకు అంతు ఉండదు. ఆకాశామే హద్దుగా అభిమానులు పండగ చేసుకుంటారు. జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని సందడి చేయడం సర్వ సాధారణం. బైక్‌లు, కార్లతో ర్యాలీలను నిర్వహిస్తుంటారు. టీమిండియా ఓడిపోయినా అదే తరహాలో విమర్శలు గుప్పించడం కూడా అంతే సహజం. ట్రోల్స్ మీద ట్రోల్స్ వేస్తుంటారు.

పాక్‌కు గాయాలబెడద..

పాక్‌కు గాయాలబెడద..

టీమిండియాలో ప్రస్తుతానికి గాయాల బెడదల్లేవీ లేవు కాగా.. పాకిస్తాన్ మాత్రం తన స్టార్ బౌలర్ షహెన్‌షా అఫ్రిదిని మిస్ చేసుకుంది. మోకాలి గాయం వల్ల అఫ్రిది ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఓపెనింగ్ బౌలర్‌ కూడా కావడం, ప్రారంభ ఓవర్లల్లో వికెట్లను పడగొట్టే సత్తా అతనికి ఉంది. ఈ సిరీస్‌కు అతను దూరమైన ప్రభావం నుంచి పాకిస్తాన్ ఎలా గట్టెక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అతని స్థానంలో హసన్ అలీని జట్టులోకి తీసుకుంది.

ఓపెనర్లు వీరే..

ఓపెనర్లు వీరే..

కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. అతని జోడీ వైస్ కేప్టెన్ కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల గాయం నుంచి కోలుకొన్న రాహుల్ జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు గానీ- ఇదివరకట్లా మెరుపులు మెరిపించలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లోకి తీసుకుని రావడమంటూ జరిగితే ఓపెనర్‌గా సూర్యకుమార్ యాదవ్ దాదాపుగా ఖాయమౌతాడు.

కోహ్లీ వర్సెస్ బాబర్..

కోహ్లీ వర్సెస్ బాబర్..

సమకాలీన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ తరహాలో దూకుడుగా ఆడగలిగే ఏకైక బ్యాటర్ పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్. మరోసారి వీరిద్దరిని మైదానంలో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. బాబర్ ఆజమ్‌కు పాకిస్తాన్ విరాట్ కోహ్లీగా పిలుచుకుంటారు ఆ దేశాభిమానులు. అన్ని ఫార్మట్లలోనూ బాబర్‌కు అద్భుతమైన రికార్డ్ ఉంది విరాట్ కోహ్లీలాగే. ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్.

తుదిజట్టులో..

తుదిజట్టులో..

భారత్ తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఆడే అవకాశం ఉంది. పాకిస్తాన్ తుదిజట్టులో- ఫకర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజమ్ (కేప్టెన్), ఖుష్దిల్ షా, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రవూఫ్, నసీమ్ షా, ఉస్మాన్ ఖాదిర్, షానవాజ్ దహానీ ఆడొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+