Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs PAK.. వర్షం అడ్డు- జరిగింది ఇదే

కొలంబో: శ్రీలంక వేదికగా కొనసాగుతున్న ఆసియా కప్ 2023 టోర్నమెంట్.. సూపర్ 4 రసవత్తరంగా మొదలైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించింది. లాహోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఫీల్డింగ్ చేసిన పాకిస్తాన్.. ప్రత్యర్థిని 193 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని 39.3 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది.

ఈ విజయంతో ప్రస్తుతం పాకిస్తాన్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండు పాయింట్ల ఆ జట్టు ఖాతాలో పడ్డాయి. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక విజయఢంకా మోగించింది. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. దీన్ని ఛేదించలేకపోయింది బంగ్లాదేశ్. 236 పరుగులకే ఆలౌట్ అయింది.

Asia cup 2023: India vs Pakistan match called off due to rain, to resume Sept 11

నేడు అసలు సిసలు గేమ్ మొదలైంది. భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు కూడా ఆతిథ్యాన్ని ఇచ్చింది కొలంబోలోని ప్రేమదాస స్టేడియమే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 24.1 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.

రోహిత్ శర్మ నాలుగు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లతో 56, శుభ్‌మన్ గిల్- 10 ఫోర్లతో 58 పరుగులు చేసి అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ-8, కేఎల్ రాహుల్- 17 పరుగులతో ఆడుతున్న సమయంలో భారీ వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత కూడా వర్షం తగ్గకపోవడం వల్ల మ్యాచ్‌ను సోమవారానికి షిఫ్ట్ చేశారు. ఎక్కడ మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే మొదలవుతుంది.

వర్షం పడుతుందనే సమాచారం ఉండటం వల్ల ముందుగానే రిజర్వ్ డేను ఏర్పాటు చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. లీగ్ దశలో ఈ రెండు ఢీ కొట్టిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్ ఆరంభం అయ్యే సమయానికి భారీ వర్షం కురవడం వల్ల ఒక్క బంతీ పడకుండా మ్యాచ్ రద్దయింది.

ఆసియా కప్ టోర్నమెంట్ మొత్తానికీ అత్యంత ఆసక్తి కలిగించే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచే. అలాంటిది లీగ్ మ్యాచ్ రద్దు కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అందుకే సూపర్ 4 దశలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌‌కు రిజర్వ్ డేను ఏర్పాటు చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఫైనల్‌ కాకుండా రిజర్వ్ డే ఉన్న ఏకైక మ్యాచ్ ఇదే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+