Asia Cup 2023: సూపర్ 4 మ్యాచ్‌లపై తుది నిర్ణయం ఇదే..

కొలంబో: ఆసియా కప్ 2023.. ఆశించిన స్థాయిలో బజ్ ఇవ్వలేకపోతోంది. భారత్- పాకిస్తాన్ తలపడుతున్న ఈ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతుందని భావించిన అభిమానులను నిరాశలో ముంచెత్తుతోంది. సుదీర్ఘకాలం తరువాత తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడిన మ్యాచ్.. అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఇన్నింగ్ మొత్తం రద్దయింది.

దీనికి కారణం- వర్షం. ఆసియా కప్ లీగ్ దశలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన పల్లెకెలె స్టేడియం భారీ వర్షానికి తడిచి ముద్దయింది. ఓ చిన్నపాటి చెరువును తలపించింది. దీని దెబ్బకు పాకిస్తాన్ ఇన్నింగ్ మొత్తం రద్దయింది. ఒక్క బంతి కూడా పడలేదు. టీమిండియా బ్యాటింగ్ చేస్తోన్నపపుడు పడని వర్షం.. ఆ తరువాత స్టేడియాన్ని ముంచెత్తింది.

Asia Cup 2023: no changes made to the super 4 and final venue

ఇదే పరిస్థితి ఇక ముందు కూడా ఉండబోతోంది. ప్రత్యేకించి- రాజధాని కొలంబో, పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో సూపర్ 4 మ్యాచ్‌లు మొదలు కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని శ్రీలంక వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెలాఖరు వరకూ మధ్య, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానున్నాయి.

అయినప్పటికీ- సూపర్ 4 మ్యాచ్‌లన్నీ కూడా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను కూడా ఈ సాయంత్రం విడుదల చేసింది. ఫైనల్ సహా సూపర్ 4 మ్యాచ్‌ల వేదికల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది.

మొదట్లో- కొలంబోలో షెడ్యూల్ అయిన మ్యాచ్‌లన్నింటినీ కూడా ఏసీసీ షిఫ్ట్ చేస్తుందనే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. పల్లెకెలె లేదా దంబుల్లాకు తరలించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఆ తరువాత సూపర్ 4 మ్యాచ్‌లను హంబన్‌టొటకు షిఫ్ట్ చేయనున్నట్లూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

వాటన్నింటికీ చెక్ పెట్టింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ..కొలంబోలోనే షెడ్యూల్ చేసింది. ఈ నెల 9, 10, 12, 14, 15 తేదీల్లో సూపర్ 4 మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. అవన్నీ కొలంబోలోనే జరుగనున్నాయి. ఇక 17వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే జరుగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+