అదరగొట్టావురా ఆజామూ- మేజిక్ ఫిగర్ 151..!!

ఇస్లామాబాద్: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ అదరగొట్టింది. పసికూన నేపాల్‌పై విజృంభించింది. పాకిస్తాన్ ఇన్నింగ్‌లో ఒకేసారి రెండు సెంచరీలు నమోదయ్యాయి. జట్టు కేప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ బాబర్ ఆజమ్.. సెంచరీతో మెరిశాడు. బౌలర్ల దుమ్ము దులిపాడు. కేప్టెన్ ఇచ్చిన స్ఫూర్తితో లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్ కూడా చెలరేగాడు. సెంచరీ బాదాడు.

ముల్తాన్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్ ప్రారంభంలో తడబడింది పాక్. ఆరు ఓవర్లల్లో 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ఫకర్ జమాన్- 14, ఇమాముల్ హక్- 5 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ దశలో కేప్టెన్ బాబర్‌కు అండగా నిలిచాడు టాప్ ఆర్డర్ బ్యాటర్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.

 Babar Azam

24వ ఓవర్‌లో జట్టు స్కోర్ 111 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిజ్వాన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే నాలుగో వికెట్ రూపంలో ఆఘా సల్మాన్ కూడా వెనుదిరగడంతో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ సేపు నిలవలేదనిపించింది. అప్పటికీ బాబర్ ఆజమ్ క్రీజ్‌లోనే ఉండటం ఊరటనిచ్చినట్టయింది.

ఆఘా సల్మాన్ అవుట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ పాతుకు పోయాడు. స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ బాబర్ ఆజమ్‌తో కలిసి భారీ ఇన్నింగ్‌ను నిర్మించాడు. ఒక ఎండ్‌లో బాబర్, మరో ఎండ్‌లో ఇఫ్తికర్.. నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపారు. చివరి ఓవర్ వరకూ మరో వికెట్ పడలేదంటే వారిద్దరూ ఏ స్థాయిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో బాబర్ ఆజమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతని 31వ సెంచరీ. వన్డే ఇంటర్నేషనల్స్‌లో 19వది. టెస్టుల్లో 9, టీ20 ఇంటర్నేషనల్స్‌లో మూడు సెంచరీలు బాబర్ పేరు మీద ఉన్నాయి. ఆసియా కప్‌లో వ్యక్తిగత స్కోర్‌ను 150 పరుగుల దాటించిన మొట్టమొదటి పాకిస్తాన్ ప్లేయర్ ప్లస్ కేప్టెన్ కూడా అతనే.

చివరి ఓవర్‌లో సోమ్‌పాల్ కమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్ ఆన్ వద్ద సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఎస్ జోరాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బాబర్. మరో ఎండ్‌లో ఇఫ్తికర్ అహ్మద్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వారిద్దరూ చెలరేగడంతో పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+