Asia Cup 2023 Super 4: పాకిస్తాన్‌తో టీమ్ భారత్‌ మరోసారి బిగ్ ఫైట్

కొలంబో: ఆసియా కప్ 2023లో మరో ఆసక్తికర మ్యాచ్ ముగిసింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పోరాడి ఓడింది. శ్రీలంక జట్టుకు వెన్నులో వణుకు పుట్టించింది. చిట్టచివరి వరకూ పోరాడింది గానీ.. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలమైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. పాథుమ్ నిశ్శంక-41, దిముత్ కరుణరత్నె-32, కుషాల్ మెండిస్- 91, చరిత అసలంక-36, దునిత్ వెల్లెగెలె- 33 (నాటౌట్), మహీష్ తీక్షణ- 28 పరుగులు చేశారు. కేప్టెన్ డాసన్ శనక, ధనంజయ డిసిల్వా, సదార సమరవిక్రమ విఫలం అయ్యారు.

Rashid Khan

292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్లు తెగించి ఆడారు. ఓవర్‌కు ఎనిమిది పరుగులతో స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. టీ20 ఫార్మట్‌లో చెలరేగారు. ఓపెనర్లను వెంటవెంటనే కోల్పోయినప్పటికీ.. టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు లంకేయులకు చుక్కలు చూపారు. గెలుపు అంచుల వరకూ వెళ్లారు గానీ దాన్ని అందుకోలేకపోయారు. 37.4 ఓవర్లల్లో 289 పరుగులకు ఆలౌట్ అయ్యారు ఆఫ్ఘన్లు.

రహ్మనుల్లా గుర్బాజ్- 4, ఇబ్రహీం జడ్రన్- 7, గుల్బదీన్ నయీబ్- 22, రహ్మత్ షా- 45, కేప్టెన్ హష్మతుల్లా షాహిది- 59, మహ్మద్ నబీ- 65, కరీం జనత్- 22, నజీబుల్లా జడ్రన్- 23, ముజీబుర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ సున్నా పరుగులు చేశారు. రషీద్ ఖాన్- 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్ ఫలితంతో ఇక సూపర్ 4లో ఆడబోయే జట్లు ఏవి అనేది తేలిపోయింది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌ నుంచి ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ వైదొలిగాయి. ఈ రెండు జట్లూ ఇంటిదారి పట్టాయి. భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4కు క్వాలిఫై అయ్యాయి.

Rohit Sharma

రేపటి నుంచి సూపర్ 4 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. సూపర్ 4లో ప్రతి జట్టు కూడా మూడేసి మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరుగనుంది. లాహోర్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9వ తేదీ శ్రీలంక- బంగ్లాదేశ్ తలపడనున్నాయి.

10వ తేదీన భారత్ తన దాయాది పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. 12వ తేదీన భారత జట్టు శ్రీలంకతో తలపడుతుంది. 14వ తేదీన శ్రీలంక- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. 15వ తేదీన జరిగే చివరి మ్యాచ్‌లో భారత్- బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతుంది.

సూపర్ 4 మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. అన్నీ డే/నైట్ గేమ్‌లే. కొలంబోలో వచ్చే వారం మొత్తం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు శ్రీలంక వాతావరణ కేంద్రం అంచనా వేసిన నేపథ్యంలో ఆయా మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+