Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Asia Cup 2023: భారీ వర్షాల దెబ్బ- మ్యాచ్‌ల నిర్వహణపై కీలక నిర్ణయం..?

కొలంబో: ఆసియా కప్ 2023.. ఆశించిన స్థాయిలో బజ్ ఇవ్వలేకపోతోంది. భారత్- పాకిస్తాన్ తలపడుతున్న ఈ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతుందని భావించిన అభిమానులను నిరాశలో ముంచెత్తుతోంది. సుదీర్ఘకాలం తరువాత తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడిన మ్యాచ్.. అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఇన్నింగ్ మొత్తం రద్దయింది.

దీనికి కారణం- వర్షం. భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన పల్లెకెలె స్టేడియం భారీ వర్షానికి తడిచి ముద్దయింది. ఓ చిన్నపాటి చెరువును తలపించింది. దీని దెబ్బకు పాకిస్తాన్ ఇన్నింగ్ మొత్తం రద్దయింది. ఒక్క బంతి కూడా పడలేదు. టీమిండియా బ్యాటింగ్ చేస్తోన్నపపుడు పడని వర్షం.. ఆ తరువాత స్టేడియాన్ని ముంచెత్తింది.

Asia Cup 2023: Super 4 matches likely to shift to Dambulla or Pallekele from Colombo

ఇదే పరిస్థితి ఇక ముందు కూడా ఉండొచ్చు. ప్రత్యేకించి- రాజధాని కొలంబో, పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. సూపర్ 4 మ్యాచ్‌ల నాటికి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెలాఖరు వరకూ భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ముందు జాగ్రత్త చర్యలను తీసుకోనుంది. కొలంబో వేదికగా జరిగే సూపర్ 4, ఫైనల్ మ్యాచ్‌లన్నింటినీ షిఫ్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ 4 మ్యాచ్‌లను పల్లెకెలె లేదా దంబుల్లా స్టేడియాలకు షిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.

ఈ నెల 9, 10, 12, 14, 15 తేదీల్లో సూపర్ 4 మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. అవన్నీ కొలంబోలోనే జరుగనున్నాయి. ఇక 17వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే జరుగనుంది. మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో- ఫైనల్ సహా ఆయా మ్యాచ్‌లన్నింటినీ పల్లెకెలె లేదా దంబుల్లాలకు తరలించవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+