Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Asia Cup 2023: సూపర్ 4 మ్యాచ్‌లన్నీ అక్కడికి షిఫ్ట్

కొలంబో: ఆసియా కప్ 2023.. ఆశించిన స్థాయిలో బజ్ ఇవ్వలేకపోతోంది. భారత్- పాకిస్తాన్ తలపడుతున్న ఈ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతుందని భావించిన అభిమానులను నిరాశలో ముంచెత్తుతోంది. సుదీర్ఘకాలం తరువాత తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడిన మ్యాచ్.. అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఇన్నింగ్ మొత్తం రద్దయింది.

దీనికి కారణం- వర్షం. భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన పల్లెకెలె స్టేడియం భారీ వర్షానికి తడిచి ముద్దయింది. ఓ చిన్నపాటి చెరువును తలపించింది. దీని దెబ్బకు పాకిస్తాన్ ఇన్నింగ్ మొత్తం రద్దయింది. ఒక్క బంతి కూడా పడలేదు. టీమిండియా బ్యాటింగ్ చేస్తోన్నపపుడు పడని వర్షం.. ఆ తరువాత స్టేడియాన్ని ముంచెత్తింది.

Asia Cup 2023: Super 4 matches will be shifted to Hambantota

ఇదే పరిస్థితి ఇక ముందు కూడా ఉండబోతోన్నాయి. ప్రత్యేకించి- రాజధాని కొలంబో, పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో సూపర్ 4 మ్యాచ్‌లు మొదలు కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని శ్రీలంక వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెలాఖరు వరకూ మధ్య, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానున్నాయి.

దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. కొలంబో వేదికగా జరిగే సూపర్ 4, ఫైనల్ మ్యాచ్‌లన్నింటినీ షిఫ్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే పరిస్థితులు లేకపోవడం వల్ల మ్యాచ్‌లను తరలించాలని తీర్మానించుకుంది.

Asia Cup 2023: Super 4 matches will be shifted to Hambantota

సూపర్ 4 మ్యాచ్‌లను హంబన్‌టొటకు షిఫ్ట్ చేయనుంది. ప్రస్తుతం అక్కడ వర్షాలు పడట్లేదు. కొలంబోలో జరగబోయే సూపర్ 4 మ్యాచ్‌లను మొదట్లో పల్లెకెలె లేదా దంబుల్లా స్టేడియాలకు షిఫ్ట్ చేయాలని భావించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. అక్కడ ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉండటంతో ప్రత్యామ్నాయంగా హంబన్‌టొటకు తరలించాలని డిసైడ్ అయింది.

ఈ నెల 9, 10, 12, 14, 15 తేదీల్లో సూపర్ 4 మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. అవన్నీ కొలంబోలోనే జరుగనున్నాయి. ఇక 17వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే జరుగనుంది. మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో- ఫైనల్ సహా ఆయా మ్యాచ్‌లన్నింటినీ హంబన్‌టొటకు షిఫ్ట్ కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+