Personal Loan: తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్.. ఎక్కడంటే..!

చాలా మంది ఆర్థిక అత్యవసరాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పర్సనల్ లోన్ పై ఆధారపడతారు. అత్యవసర సమయంలో వ్యక్తగత రుణం ఉపయోగపడుతుంది. చాలా ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్లు ఇస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ కూడా వ్యక్తగత రుణాలను మంజూరు చేస్తోంది. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ను త్వరగా పొందవచ్చు. లోన్ అప్రూ అయిన వెంటనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఆ తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవాలి

1.త్వరగా డబ్బు వస్తుంది
అత్యవసర ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు మీరు ఎవరైనా అప్పు అడిగితే ఎక్కువ వడ్డీ చెల్లించాలంటారు. అదే పర్సనల్ లోన్ తీసుకుంటే త్వరగా లోన్ వస్తుంది. వడ్డీ కూడా బయట కంటే తక్కువగా ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఆమోదం పొందిన 24 గంటలలోపు డబ్బులు తీసుకోవచ్చు.

Bajaj Finance provides personal loans within a short period of time

2. తాకట్టు అవసరం లేదు
గృహ రుణాలు లేదా కారు రుణాలు వంటి ఇతర రకాల రుణాల మాదిరిగా కాకుండా, వ్యక్తిగత రుణానికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. దీనర్థం మీరు మీ ఆస్తులను రిస్క్ చేయకుండా డబ్బు తీసుకోవచ్చు.

3. సౌకర్యవంతమైన చెల్లింపు:

వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించేందుకు అనేక అవకాశాలు ఉంటాయి. మీరు మీకు వచ్చే అదాయం ఆధారంగా చెల్లింపు ఎంపికను ఎంచుకోవచ్చు. మీరు లోన్‌ను త్వరగా తిరిగి చెల్లించడానికి తక్కువ కాల వ్యవధిని లేదా నెలవారీ EMI భారాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకునే అవకాశం ఉంది. బజాజ్ ఫైనాన్స్ సో పర్సనల్ లోన్‌ తీసుకుంటే తిరిగి చెల్లించడానికి గరిష్ఠంగా 96 నెలల కాలవ్యవధిని ఎంచుకోవచ్చు.

4. క్రెడిట్ స్కోర్‌ పెరుగుదల:
చాలా మంది క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది. మీరు పర్సనల్ లోన్ తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతోంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు భవిష్యత్ లో తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే అధిక మొత్తంలో కూడా లోన్లు తీసుకోవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఆఫర్‌లను పొందే అవకాశం ఉంటుంది.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఫీచర్లు

మీ అత్యవసర అవసరాలను తీర్చడానికి బజాజ్ ఫైనాన్స్ నుంచి వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. బజాజ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ తీసుకోడం ద్వారా నాలుగు లాభాలు ఉన్నాయి.

కేవలం 5 నిమిషాల్లో ఆమోదం: మీ లోన్ అప్లికేషన్‌పై తక్షణ ఆమోదం పొందుతుంది.

త్వరిత పంపిణీ: మీరు ఆమోదం పొందిన 24 గంటలలోపు డబ్బులు మీ ఖాతాలో జమ అవుతుంది.

అధిక రుణ మొత్తం: మీరు మీ అత్యవసర అవసరాలు తీర్చుకోవడానికి రూ. 40 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.

కనీస డాక్యుమెంటేషన్: లోన్ రావాలంటే కొన్ని ప్రాథమిక పత్రాలను సమర్పిస్తే చాలు.

బజాజ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ కు దరఖాస్తు చేసే ముందు మీ అర్హత, అవసరమైన డాక్యుమెంట్‌లను చెక్ చేసుకోవడం చాలా అవసరం. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ పొందడానికి, మీరు కొన్ని ప్రాథమిక అర్హతలు కలిగి ఉండాలి.

జాతీయత: భారతీయుడు అయి ఉండాలి.

వయస్సు: 21 నుంచి 80 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఉద్యోగం: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎంఎన్సీ కంపెనీలు పని చేస్తూ ఉండాలి.

క్రెడిట్ స్కోర్: 685 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

నెలవారీ జీతం: జీతం కనీసం రూ. 25,001 ఉండాలి. మీరు నివసిస్తున్న నగరం ఆధారంగా కనీస జీతాన్ని నిర్ణయిస్తారు.

వయస్సును బట్టి చెల్లింపు వ్యవధి నిర్ణయం

మీరు మీ వయస్సును బట్టి ఈఎంఐలు ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు మీ లోన్ మొత్తం కాలపరిమితి, వడ్డీ రేటు ఆధారంగా మీరు చెల్లించాల్సిన EMI మొత్తాన్ని నిర్ణయిస్తారు. పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు. ఇది మీ రీపేమెంట్ బడ్జెట్‌కు సౌకర్యవంతంగా సరిపోయే లోన్ మొత్తాన్ని ఎంచుకోవడంలో మీకు ఈ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. అత్యవసర సమయాల్లో వ్యక్తిగత రుణం విలువైన ఆర్థిక వనరుగా ఉంటుంది. అయితే అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు బాధ్యతాయుతంగా అప్పు తీసుకోవడం, సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం.

గమనిక: షరతులు వర్తిస్తాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+