RCB vs RR : నేడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడనున్న రాజస్తాన్ రాయల్స్...
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా శనివారం(అక్టోబర్ 3) అబుదాబి వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్-రాజస్తాన్ రాయల్స్ జట్లు పోటీ పడనున్నాయి. పాయింట్ల పట్టికలో దాదాపు సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు.. ఇప్పటివరకూ ఆడిన చెరో మూడు మ్యాచ్‌లలో రెండింట్లో విజయం సాధించాయి. తాజా మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో బరిలో దిగనున్నాయి.
బెంగళూరు జట్టు తమ చివరి మ్యాచ్‌లో విజయంతో ఊపు మీద ఉండగా... తమ చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఓటమితో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న కసితో రాజస్తాన్ ఉంది.
దీంతో రెండు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరిగా సాగే అవకాశం ఉంది. డివిలియర్స్,ఫించ్,కోహ్లి లాంటి హార్డ్ హిట్టర్స్‌తో అటు ఆర్సీబీ... స్మిత్,సంజు శాంసన్,తెవాటియా వంటి హార్డర్ హిట్టర్స్‌తో ఇటు రాజస్తాన్ బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఉన్నాయి.

బ్యాటింగ్ విషయంలో బాగానే ఉన్నా... బౌలింగ్ ఆర్సీబీని టెన్షన్ పెడుతోంది. పంజాబ్,ముంబైలతో మ్యాచ్‌లలో డెత్ ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఇరు జట్ల ఫాస్ట్ బౌలర్స్ పవర్ ప్లేలో పరుగులను నియంత్రించలేకపోతున్నారు. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఈ రెండు జట్ల బౌలర్లు పవర్ ప్లేలో కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగారు. వీటన్నింటిని అధిగమించి నేటి మ్యాచ్‌లో విక్టరీ కోసం రెండు జట్లు తలపడనున్నాయి.












Click it and Unblock the Notifications