Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏకంగా ప్రధాని జోక్యం- యూటర్న్ తీసుకున్న స్టార్ క్రికెటర్

ఢాకా: తమీమ్ ఇక్బాల్. బంగ్లాదేశ్‌కు చెందిన స్టార్ క్రికెటర్. ఆ దేశ జట్టు సారథి. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఎదుర్కొంటోంది. ఒక టెస్ట్, మూడు వన్డేలు, రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడటానికి వచ్చిన ఆఫ్ఘన్ జట్టుతో తలపడుతోంది. ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ జయకేతనాన్ని ఎగురవేసింది గానీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. తొలి వన్డేలో ఘోరంగా ఓడిపోయింది.

వర్షం వల్ల ఓవర్లను కుదించిన ఈ మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ విధానంలో నెగ్గింది ఆఫ్ఘనిస్తాన్ టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 43 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కేప్టెన్ తమీమ్ ఇక్బాల్ విఫలం అయ్యాడు. 13 పరుగులే చేశాడు. మిడిలార్డర్‌లో తౌహిద్ హృదోయ్ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. అతను తప్ప మరే బ్యాటర్ కూడా భారీ పరుగులు చేయలేకపోయారు.

Bangladesh captain Tamim Iqbal has withdrawn his decision from retirement

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 21.4 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసిన దశలో వర్షం కురిసింది. స్టేడియం మొత్తం తడిచి ముద్దయింది. మ్యాచ్‌ను కొనసాగించడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. దీనితో డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిచినట్లు ప్రకటించారు అంపైర్లు.

ఈ ఓటమితో కలత చెందాడు తమీమ్ ఇక్బాల్. మ్యాచ్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచీ వైదొలగుతున్నట్లు వెల్లడించాడు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్‌లో కలకలం రేపింది. 34 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ నుంచి తప్పుకోవడాన్ని అభిమానులెవరూ స్వాగతించలేకపోయారు.

చివరికి- బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సైతం జోక్యం చేసుకున్నారు. తమీమ్ ఇక్బాల్‌ను తన అధికారిక భవనానికి పిలిపించుకున్నారు. ఈ మధ్యాహ్నం ఢాకాలో గల షేక్ హసీనా నివాసానికి వెళ్లాడు తమీమ్. ఆ సమయంలో ఆయన భార్య ఆయేషా సిద్ధికా, జట్టు మాజీ కేప్టెన్ మష్రాఫ్ మొర్తాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఉన్నారు.

రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేయాల్సిందిగా షేక్ హసీనా సూచించారు. భావోద్వేగంతో నిర్ణయాలను తీసుకోలేమనీ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘకాలం కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. గెలుపోటములు సహజమేనని, వాటిని సమంగా స్వీకరించాలని అన్నారు. బంగ్లా క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు కూడా తమీమ్ ఇక్బాల్‌కు నచ్చజెప్పారు.

ప్రధాని చేసిన సూచనలకు తమీమ్ ఇక్బాల్ నో అనలేకపోయారు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం అతను విలేకరులతో మాట్లాడారు. ఈ దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాని చేసిన విజ్ఞప్తిని తాను కాదనలేకపోయానని అన్నాడు. నో చెప్పడం అసాధ్యమని వ్యాఖ్యానించాడు.

నెలన్నర రోజుల విరామం అడిగానని, ఆ తరువాత క్రికెట్‌లో రీఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశాడు. అతను శారీరకంగా, మానసికంగా సంసిద్ధుడు కావడానికి ఆరు వారాల విరామం ఇచ్చినట్లు నజ్ముల్ హసన్ తెలిపారు. ఆ తరువాత క్రికెట్‌లో అడుగుపెడతాడని, రిటైర్మెంట్ ప్రకటనను ఉపసంహరించుకున్నాడని ప్రకటించారు. కాగా- అతని గైర్హాజర్‌లో జట్టుకు లిట్టన్ దాస్ కేప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+