ఆంధ్రా బార్డర్ లో ఏం జరిగింది. మాజీ స్పీకర్ శిష్యుడు ప్రమోద్ రెడ్డితో?
బెంగళూరు/కోలారు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని, ఆ డబ్బు నాదే, మీకు నేను నా సొంత డబ్బులు ఇస్తున్నానని ప్రచారం చేసుకుంటున్న నాయకుడి బండారం బయటపెట్టినందుకు ప్రమోద్ రెడ్డి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామ పంచాయితీ సభ్యుడు పోలీసులను ఆశ్రయించాడు.
కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ సొంత నియోజక వర్గం ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని శ్రీనివాసపురం. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని (గతంలో చిత్తూరు జిల్లా)లోని మదనపల్లెకు కు కేవలం 12 కిలోమీటర్ల దూరం నుంచి శ్రీనివాసపురం నియోజక వర్గం మొదలౌవుతుంది. ఈ నియోజక వర్గంలోని ప్రజలు ప్రతిరోజు వేలాది మంది మదనపల్లెకు వచ్చి వెలుతుంటారు.

శ్రీనివాసపురం నియోజక వర్గం నుంచి కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. డీసీసీ బ్యాంక్ నుంచి మహిళా గ్రూప్ లు (స్త్రీ శక్తి గ్రూప్స్ కు) నిధులు విడుదల చేస్తున్నారు. డీసీసీ బ్యాంక్ నుంచి పలు మహిళా సంఘాల సభ్యులు రుణం తీసుకుని వారి అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం స్త్రీ శక్తి గ్రూప్ లకు నిధులు అందిస్తున్నది. అయితే మాజీ స్పీకర్ రమేష్ కుమార్ తన సొంత డబ్బును డీసీసీ బ్యాంక్ ద్వారా స్త్రీ శక్తి గ్రూపలకు డబ్బులు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ గ్రామ పంచాయితీ సభ్యుడు నవీన్ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
గ్రామ పంచాయితీ సభ్యుడు పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో నువ్వు పోస్టు చేసిన వీడియో వెంటనే డిలీట్ చెయ్యాలని, లేదంటే నిన్ను అడ్డంగా నరికేస్తామని, నిన్ను ప్రాణాలతో వదలమని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ అనుచరుడు ప్రమోద్ రెడ్డి బెదిరిస్తున్నాడని నవీన్ కోలారు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
ప్రమోద్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో తనకు ప్రాణహాని ఉందని నవీన్ కేసు పెట్టారని, కేసు విచారణలో ఉందని కోలారు గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాని, ప్రమోద్ రెడ్డి కాని ఇంత వరకు ఎలాంటి క్లారిటీకాని, కౌంటర్ కాని ఇవ్వలేదని కన్నడ మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications